సీనియర్ నిర్మాతని దారుణంగా అవమానించిన సామ్?

Purushottham Vinay
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత వరుస సినిమాల్లో నటిస్తూ ప్రస్తుతం చాలా బిజీగా వుంది. ఓ వైపు ఆరోగ్యం బాగాలేక చికిత్స పొందుతూనే సినిమా షూటింగ్ లో పాల్గొంటూ వుంది.కొంచెం బ్రేక్ తీస్కొని తన ఆరోగ్యాన్ని బాగు చేసుకుంది. ఇక అప్పటి నుంచి వరుసగా సినిమాలు వెబ్ సరీస్ ల షూటింగ్ లు ప్రమోషన్ పనులతో బిజీ అయిపోయింది. ఎప్పటికప్పుడు వరుస ఇంటర్వ్యూలు ఇస్తూ తెగ సందడి చేస్తోంది.అయితే తాజాగా ఈ హాట్ బ్యూటీ నిర్మాత చిట్టిబాబుపై తనదైన స్టైల్ లో సెటైర్ వేసింది. ఇన్ స్టా వేదికగా సామ్ ఓ స్టోరీని పెట్టింది. అందులో వ్యక్తుల చెవుల నుండి జుట్టు ఎలా పెరుగుతుందని గూగుల్ లో సెర్చ్ చేసి దాని స్క్రీన్ షాట్ ను సమంత పోస్ట్ చేసింది.అయితే టెస్టో స్టిరాన్ పెరగడమే మనుషులు చెవుల్లోంచి జుట్టు పెరగడానికి కారణం అంటూ గూగుల్ చెప్పుకొచ్చింది. అయితే ఇది చిట్టి బాబు చెవుల దగ్గర భారీగా వెంట్రుకలు పెరగడాన్ని సూచిస్తోందని ఇప్పుడు అందరూ అనుకుంటున్నారు.ఇక ఇటీవలే ఈ చిట్టిబాబు స్టార్ హీరోయిన్ సమంత గురించి ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడారు.


సామ్ కెరియర్ ముగిసిపోయిందని ఆమె తన సినిమాలను ప్రమోట్ చేసుకునేందుకు చీప్ ట్రిక్స్ ఉపయోగించిందని చిట్టిబాబు వైరల్ కామెంట్స్ చేశాడు.అయితే దీనికి కౌంటర్ గానే సామ్ ఇన్ స్టాలో ఇలా ఈ స్టోరీ పెట్టినట్లు సమాచారం తెలుస్తోంది.సమంత తాజాగా సిటాడెల్ వెబ్ సిరీస్ లో నటిస్తూ బాగా బిజీగా వుంది. అలాగే ఈ వెబ్ సిరీస్ ను ప్రమోట్ చేసేందుకు లండన్ లో ప్రీమియర్ షోలను కూడా వేశారు. ఈ క్రమంలోనే చిత్రబృందం లండన్ కి వెళ్లింది. సమంత కూడా అక్కడకు వెళ్లి బాగా ఎంజాయ్ చేస్తోంది. ఇందుకు సంబంధించిన ఫొటోలను కూడా తన ఇన్ స్టా వేధికగా షేర్ చేస్తూనే ఉంది. అక్కడి నుంచి ఇండియాకు రాగానే సిటాడెల్ షూటింగ్ లో సమంత పాల్గొంటుంది.ఇక సమంత ప్రధాన పాత్రలో తెరకెక్కిన 'శాకుంతలం' చిత్రాన్ని అగ్ర నిర్మాత దిల్ రాజు సమర్పించిన విషయం తెలిసిందే.సీనియర్ డైరెక్టర్ గుణశేఖర్ దర్శకత్వంలో పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కిన ఈ సినిమా ఏప్రిల్ 14వ తేదీన విడుదల అయింది. ఫుల్ నెగెటివ్ టాక్ రావడంతో రెండో రోజునే థియేటర్ల నుంచి ఈ సినిమా తప్పుకొని బిగ్గెస్ట్ డిజాస్టర్ గా నిలిచింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: