పవన్ లాగే నవ్వులపాలైన సల్మాన్ భాయ్?

Purushottham Vinay
వరుస ప్లాప్స్ తో బాగా సతమతమైన బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ తాజాగా నటించిన కిసీ కా బాయ్ కిసీ కా జాన్ సినిమా కూడా రిలీజ్ అయ్యి భారీ నిరాశనే మిగిల్చింది. ఈ సినిమాలో సల్మాన్ భాయ్ పక్కన పూజా హెగ్డే హీరోయిన్ గా నటించింది. ఈద్ పండుగ సందర్భంగా ఏప్రిల్ 21వ తేదీన విడుదలైన ఈ సినిమా బాక్సాఫీసు వద్ద బోల్తా పడి భారీ వసూళ్లను సాధించలేకపోయింది.ఈ సినిమా మొదటి రోజు చాలా తక్కువ స్థాయిలో దారుణంగా వసూళ్లను రాబట్టింది. న్యాచురల్ స్టార్ నాని హీరోగా కీర్తి సురేష్ హీరోయిన్ గా ఇటీవలే వచ్చిన దసరా సినిమా మొదటి రోజు ఏపీ తెలంగాణ వసూళ్లు (14 కోట్లు) చేసిన కలెక్షన్ల రేంజ్ లో కూడా ఈ సినిమా రాబట్టలేకపోయింది. దేశవ్యాప్తంగా కేవలం ఈ సినిమా 12 కోట్ల రూపాయల బాక్సాఫీస్ కలెక్షన్లను మాత్రమే సాధించింది. దీంతో సల్మాన్ ఖాన్ ఫ్యాన్స్ అంతా తెగ నిరాశకు గురయ్యారు.అయితే ఈ సినిమా ప్లాప్ కి కారణం సల్మాన్ ఖాన్.ఎందుకంటే అందరూ స్టార్ హీరోలు కూడా సినిమాకు కంటెంట్ ఎలా ఉండాలి ప్రేక్షకులను రీచ్ అవ్వాలంటే ఏం చేయాలా అని ఆలోచించుకుని మరీ అదిరిపోయే సినిమాలతో ప్రేక్షకులలోకి వస్తుంటే.. సల్లూ భాయ్ మాత్రం భోజ్ పురి స్టాండర్డ్స్ సినిమాతో రావడం అందరనీ ఎంతగానో ఆశ్చర్యంలో పడేసింది.


ఈ సినిమాని డైరెక్టర్ ఫర్హాద్ సమ్జీ తెరకెక్కించారు. ఈ సినిమాలో మొత్తం 8 పాటలు ఉండడం సినిమాకు ఇంకో పెద్ద మైనస్ గా నిలిచినట్లు చాలా మంది భావిస్తున్నారు. అలాగే మరో బిగ్గెస్ట్ మైనస్ పూజ హెగ్డే. పాప యాక్టింగ్ గురించి తెలిసిందే. ఇంకా అంతేకాదు డైరెక్టర్ ఫర్హాద్ సమ్జీ తీస్తున్న సినిమాలు అన్ని వరుస ఫ్లాపులుగా నిలుస్తున్నాయి. ముఖ్యంగా పదేళ్ల క్రితం నాటి తమిళ సినిమాని రీమేక్ చేస్తే ఫలితం ఇలాగే ఉంటుందని కూడా పలువురు చెబుతున్నారు.కిసీ కా భాయ్ కిసీ కా జాన్ అనేది తమళ వీరమ్ సినిమాకి రీమేక్. ఇది హిట్ అయినా కూడా పరమ రొట్ట సినిమా. దీన్ని ఒక్కసారి చూడటమే ఎక్కువ.అయితే ఇదే చిత్రాన్ని తెలుగులో డబ్ చేశారు. అయినా కానీ కాటమ రాయుడుగా తెరకెక్కించి పవన్ కళ్యాణ్ హీరోగా రీమేక్ చేసి నవ్వుల పాలయ్యడు. ఇప్పుడు భాయ్ నవ్వుల పాలవుతున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: