"ఆది పురుష్" మూవీని ఓవర్సీస్ లో విడుదల చేయనున్న ప్రముఖ సంస్థ..?

Pulgam Srinivas
రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన అత్యంత భారీ బడ్జెట్ మూవీ ఆది పురుష్ మరి కొన్ని రోజుల్లో విడుదల కాబోతున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ కి బాలీవుడ్ ఇండస్ట్రీ లో అద్భుతమైన గుర్తింపు కలిగిన దర్శకులలో ఒకరు అయినటు వంటి ఓం రౌత్ దర్శకత్వం వహించగా ... ఈ సినిమాలో ప్రభాస్ సరసన హీరోయిన్ గా కృతి సనన్ నటించింది. ఇది ఇలా ఉంటే ప్రభాస్ ఈ మూవీ లో రాముడి పాత్రలో కనిపించనుండగా ..  కృతి సనన్ ఈ సినిమాలో సీత పాత్రలో కనిపించబోతుంది. ఈ మూవీ యూనిట్ కొన్ని రోజుల క్రితమే ఈ సినిమా నుండి ప్రభాస్ కు సంబంధించిన ఒక ఫస్ట్ లుక్ పోస్టర్ ను మరియు టీజర్ ను విడుదల చేసింది.

ప్రభాస్ ఫస్ట్ లుక్  పోస్టర్ కు ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ లభించినప్పటికీ ... ఈ సినిమా టీజర్ కు మాత్రం ప్రేక్షకుల నుండి గొప్ప రెస్పాన్స్ లభించ లేదు. దానితో ఈ సినిమా బృందం ఈ మూవీ కి సంబంధించిన "వి ఎఫ్ ఎక్స్" పనులను మరింత మెరుగ్గా నిర్వహించి ఈ సినిమాను విడుదల చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఇది ఇలా ఉంటే ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడడంతో ఇప్పటికే ఈ మూవీ యూనిట్ ఈ సినిమాకు సంబంధించిన ఓవర్సీస్ హక్కులను అమ్మివేసినట్లు తెలుస్తోంది.

ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం ఆది పురుష్ మూవీ యొక్క ఓవర్సీస్ హక్కులను ఏఏ ఫిల్మ్స్ సంస్థ దక్కించుకున్నట్లు తెలుస్తోంది. ఇది ఇలా ఉంటే ప్రభాస్ ప్రస్తుతం ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపొందుతున్న సలార్ మూవీ లోను ... నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్రాజెక్ట్ కే మూవీ లోనూ ... మారుతి దర్శకత్వంలో రూపొందుతున్న మరో మూవీ నటిస్తున్నాడు. ఈ మూవీ లపై ప్రభాస్ అభిమానులతో పాటు మామూలు సినీ ప్రేమికుల్లో కూడా భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: