"నాగార్జున" బ్లాక్ బస్టర్ మూవీకి 29 ఏళ్లు..!

Pulgam Srinivas
టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. నాగార్జున ఇప్పటికే ఎన్నో అదిరిపోయే విజయవంతమైన సినిమా లలో హీరో గా నటించి ఇప్పటికీ కూడా తెలుగు సినిమా ఇండస్ట్రీ లో మోస్ట్ క్రేజీయేస్ట్ సీనియర్ స్టార్ హీరో గా కెరియర్ ను కొనసాగిస్తున్నాడు. ఇది ఇలా ఉంటే నాగార్జున తన కెరీయర్ లో నటించిన బ్లాక్ బాస్టర్ మూవీ లలో హలో బ్రదర్ మూవీ ఒకటి. ఈ మూవీ కి ఈ వి వి సత్య నారాయణ దర్శకత్వం వహించగా ... సౌందర్య ... రమ్యకృష్ణ ఈ మూవీ లో నాగార్జున సరసన హీరోయిన్ లుగా నటించారు.

ఈ మూవీ లో నాగార్జున డ్యూయల్ రోల్ లో నటించాడు. ఈ సినిమాలో నాగార్జున తన అద్భుతమైన కామెడీ టైమింగ్ తో ప్రేక్షకులకు కడుపుబ్బ నవ్వించాడు. ఈ సినిమాలో కథ ... కథనం ... సెంటిమెంట్ ... కామెడీ అన్ని అద్భుతంగా ఉండడంతో ఈ మూవీ అద్భుతమైన విజయం అందుకుంది. అలాగే ఈ మూవీ కి బాక్స్ ఆఫీస్ దగ్గర అద్భుతమైన కలెక్షన్ లు కూడా దక్కాయి. ఈ సినిమా 1994 సంవత్సరం ఏప్రిల్ 20 తేదీన విడుదల అయింది.

శ్రీ దుర్గా ఆర్ట్స్ నిర్మించిన ఈ మూవీ కి రాజ్  -  కోటి సంగీతం అందించారు. ఆ కాలంలో బాక్స్ ఆఫీస్ దగ్గర బ్లాక్ బాస్టర్ విజయం సాధించిన ఈ మూవీ నేటితో 29 ఏళ్లు పూర్తి చేసుకుంది. ఈ మూవీ ద్వారా ఈ వి వి సత్య నారాయణ ... నాగార్జున ... సౌందర్య ... రమ్య కృష్ణ క్రేజ్ అమాంతం పెరిగి పోయింది. ఇది ఇలా ఉంటే ఈ మూవీ విజయంలో రాజ్  -  కోటి అందించిన సంగీతం కూడా అత్యంత కీలక పాత్రను పోషించింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: