పవన్ కళ్యాణ్ తో సినిమాను చేయబోతున్న సుధీర్ వర్మ ...!!

murali krishna
మాస్ రాజా రవితేజ హీరోగా నటించిన రావణాసుర చిత్రం  ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. ఆ సినిమా ప్రమోషన్ కార్యక్రమంలో భాగంగా దర్శకుడు సుధీర్ వర్మ మాట్లాడుతూ తాను త్వరలో పవన్ కళ్యాణ్ ని డైరెక్ట్ చేయబోతున్నట్లుగా కూడా చెప్పుకొచ్చాడు.
త్రివిక్రమ్ శ్రీనివాస్ రూపొందించిన స్క్రిప్ట్ తో సుధీర్ వర్మ పవన్ కళ్యాణ్ కాంబినేషన్ సినిమా రూపొందబోతుందని సినీ వర్గాల్లో కూడా ప్రచారం కూడా జరుగుతుంది. ఆ విషయమై సుదీర్ వర్మ చేసిన వ్యాఖ్యలతో మరింత క్లారిటీ కూడా వచ్చింది. అయితే రావణాసుర సినిమా బాక్సాఫీస్ వద్ద పరాజయం పాలైంది.. దాంతో పవన్ కళ్యాణ్ తో సినిమా ఉంటుందా లేదా అనే అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి.
తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం సుధీర్ వర్మ ప్రస్తుతం అదే పనిలో ఉన్నట్లుగా అయితే తెలుస్తోంది. పవన్ కళ్యాణ్ కి తగ్గట్లుగా డైలాగ్స్ కూడా రాస్తూ షూటింగ్ కార్యక్రమాలను నిర్వహించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారట.ప్రస్తుతం పవన్ కళ్యాణ్ చేస్తున్న సినిమాల షూటింగ్ పూర్తి అయిన వెంటనే  ఈ సంవత్సరం చివర్లోనే సుదీర్ వర్మ దర్శకత్వంలో సినిమా ఉండే అవకాశాలు ఉన్నాయని వార్తలు కూడా వస్తున్నాయి. సాధ్యమైనంత ఎక్కువ సమయాన్ని ఈ మధ్య కాలంలో పవన్ కళ్యాణ్ సినిమాలకు అయితే కేటాయిస్తున్నారు. కనుక సుధీర్ వర్మ సినిమా ను కూడా ఎన్నికలకు ముందే ముగించే అవకాశాలు వున్నాయి అంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం సుధీర్ వర్మ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ లో చాలా బిజీగా ఉన్నాడు. అని అనుకున్నట్లుగా జరిగితే ఈ సంవత్సరంలోనే షూటింగ్ కూడా ముగించే అవకాశాలు కూడా ఉన్నాయి. పవన్ కళ్యాణ్ ఈ మధ్య కాలంలో కమిట్ అయిన ప్రతి సినిమా కి 30 నుండి 60 రోజుల డేట్స్ ను మాత్రమే ఇస్తున్నాడు. సుదీర్ వర్మ కి కూడా తక్కువ డేట్స్ ను అయితే ఇవ్వబోతున్నాడు. ఆ తక్కువ డేట్స్ లోనే సినిమా ను ముగించేలా సుధీర్ వర్మ ప్లాన్ చేయబోతున్నట్లు సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: