ఈరోజు తెలుగు సినిమాల షూటింగ్ల వివరాలు ఇవే..!

Pulgam Srinivas
ఈరోజు మంచి క్రేజ్ ఉన్న తెలుగు సినిమాల షూటింగ్ లు ఎక్కడెక్కడ జరుగుతున్నాయి . . వాటి అప్డేట్ ఏమిటో తెలుసుకుందాం.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం సుజిత్ దర్శకత్వంలో రూపొందుతున్న "ఓజి" అనే మూవీ లో హీరో గా నటిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ షూటింగ్ నిన్న ముంబై లో ప్రారంభం అయింది . ప్రస్తుతం కూడా ఈ షూటింగ్ ముంబై లో జరుగుతుంది. ఈ సినిమా యూనిట్ ప్రస్తుతం ముంబై లో పవన్ కళ్యాణ్ మరియు ప్రియాంక అరుల్ మోహన్ పై కొన్ని ప్రత్యేక సన్నివేశాలను చిత్రీకరిస్తుంది . ఈ మూవీ ని డి వి వి ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై ప్రముఖ నిర్మాత అయినటువంటి v v DANAIAH' target='_blank' title='డి వి వి దానయ్య-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. ">డి వి వి దానయ్య నిర్మిస్తున్నాడు.
నందమూరి నట సింహం బాలకృష్ణ ప్రస్తుతం అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందుతున్న మూవీ లో హీరో గా నటిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఈ సినిమాలో కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తూ ఉండగా ... శ్రీ లీల ఈ సినిమాలో ఒక కీలకమైన పాత్రలో నటిస్తోంది. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ జూబ్లీహిల్స్ లో జరుగుతుంది. ప్రస్తుతం జూబ్లీహిల్స్ లో జరుగుతున్న ఈ మూవీ షూటింగ్ లో ఈ చిత్ర బృందం బాలకృష్ణ ... శ్రీ లీల పై సన్నివేశాలను చిత్రీకరిస్తున్నట్లు తెలుస్తుంది.
యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న మూవీ లో హీరో గా నటిస్తున్నాడు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ రామోజీ ఫిలిం సిటీ లో జరుగుతుంది. ఈ మూవీ యూనిట్ రామోజీ ఫిలిం సిటీ లో ప్రస్తుతం ఎన్టీఆర్ ... జాన్వి కపూర్ ... సైఫ్ అలీ ఖాన్ లపై సన్నివేశాలను చిత్రీకరిస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: