4 రోజుల్లో "శాకుంతలం" మూవీకి ప్రపంచవ్యాప్తంగా వచ్చిన కలెక్షన్ల వివరాలు ఇవే..!

Pulgam Srinivas
చూడాలని ఉంది మూవీ తో తెలుగు సినిమా ఇండస్ట్రీ లో మంచి గుర్తింపును ఏర్పరచుకొని ... ఆ తర్వాత అనేక సినిమాలకు దర్శకత్వం వహించి తెలుగు సినిమా ఇండస్ట్రీ లో మంచి గుర్తింపును ఏర్పరచుకున్న గుణశేఖర్ తాజాగా శాకుంతల అనే మూవీ కి దర్శకత్వం వహించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ సినిమాలో దేవ్ మోహన్ హీరో గా నటించగా ... సమంత హీరోయిన్ గా నటించింది. ఈ మూవీ ఏప్రిల్ 14 వ తేదీన విడుదల అయ్యింది. ఇప్పటి వరకు ఈ సినిమా 4 రోజుల బాక్స్ ఆఫీస్ రన్ ను కంప్లీట్ చేసుకుంది. ఈ 4 రోజుల్లో ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా సాధించిన కలెక్షన్ ల వివరాలను తెలుసుకుందాం.
1 వ రోజు ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా 2.24 కోట్ల షేర్ ... 4.70 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసింది.
2 వ రోజు ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా 0.71 కోట్ల షేర్ ... 1.45 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసింది.
3 వ రోజు ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా 0.65 కోట్ల షేర్ ... 1.30 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసింది.
4 వ రోజు ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా 0.28 కోట్ల షేర్ ... 0.60 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసింది.
మొత్తంగా 4 రోజుల్లో ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా 3.88 కోట్ల షేర్ ... 8.06 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసింది.
ఈ సినిమాను ఏప్రిల్ 14 వ తేదీనే తెలుగు తో పాటు తమిళ్ , కన్నడ , మలయాళ , హిందీ భాషలలో 2D మరియు 3D వర్షన్ లలో విడుదల చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: