డిజాస్టర్ గా మారిన శాకుంతలం.. ఎన్ని కోట్ల నష్టమంటే..?

Divya
డైరెక్టర్ గుణశేఖర్ దర్శకత్వంలో సమంత లీడ్ రోల్ పోషించిన చిత్రం శాకుంతలం. అభిజ్ఞాన శాకుంతలం కథ ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమా ప్రేక్షకులను పూర్తిస్థాయిలో మెప్పిస్తుందని అందరూ అనుకున్నారు. కానీ ఊహించని విధంగా డిజాస్టర్ పాలయ్యింది. అంతేకాదు సమంత కెరియర్ లోనే బిగ్గెస్ట్ డిజాస్టర్ గా మిగిలిన చిత్రంగా చెప్పుకోవచ్చు. ఇక్కడ ఆశ్చర్యపోయే మరొక విషయం ఏమిటంటే సమంత మొదటిసారి నటించిన పాన్ ఇండియా సినిమా మాత్రమే కాదు ఆమె తొలిసారి నటించిన పౌరాణిక చిత్రం కూడా ఇదే కావడం గమనార్హం.
 ఇలా అన్నింటిలోనూ మొదటిగా ఉన్నప్పుడు ఆమె మరింత కష్టపడింది.  అందులోనూ మయోసైటిస్ వ్యాధి బారిన పడ్డప్పటికీ కూడా సినిమా సక్సెస్ అవ్వాలన్న ఆమె తపన వర్ణనాతీతం.  ఎన్నో కష్టాల మధ్య ఈ సినిమాను తెరకెక్కించారు.  కానీ సినిమా మాత్రం పూర్తిస్థాయిలో డిజాస్టర్ గా మిగిలింది. ఇకపోతే ఈ సినిమాలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కూతురు అల్లు అర్హ కూడా చిన్నప్పటి భరతుడి పాత్రలో అద్భుతంగా నటించింది. ఈ పాపకు ఇదే మొదటి సినిమా కావడం గమనార్హం. ఇకపోతే సినిమా డిజాస్టర్ అయినప్పటికీ కూడా అల్లు అర్హ నటనకు ప్రతి ఒక్కరు మంత్రముగ్ధులవుతున్నారు.  తన నటనతో చిన్నారి అందరినీ తన వశం చేసుకుందనే కామెంట్లు కూడా వినిపిస్తున్నాయి. ఇకపోతే ఈ సినిమా కలెక్షన్స్ విషయానికి వస్తే అతిపెద్ద డిజాస్టర్ గా నిలిచింది. ముఖ్యంగా రూ.80 కోట్ల పెట్టుబడితో తెరకెక్కిన ఈ సినిమా కేవలం రూ.8 కోట్లు మాత్రమే రాబట్టింది.  ఇక సాటిలైట్ హక్కులు కూడా ఏ భాషలోనూ ఇంకా అమ్ముడుపోకపోవడం గమనార్హం.
ఇకపోతే ఇప్పటివరకు ఎంతోమంది హీరోలు హీరోయిన్లు సినిమాలను తెరకెక్కించారు.  కానీ సమంత కెరియర్ లో బిగ్గెస్ట్ బ్లాక్ బాస్టర్ గా ఈ సినిమా నిలవడం ఆమె అభిమానులను తట్టుకోలేకపోయేలా చేస్తోంది. మొత్తానికి అయితే ఈ సినిమా ఇంత డిజాస్టర్ గా నిలవడం బాధాకరమని చెప్పాలి. దిల్ రాజు పెట్టుకున్న నమ్మకం కూడా ఈ సినిమాతో పూర్తిగా పోయిందని చెప్పవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: