ప్రభాస్ సలార్ కోసం.. ప్రశాంత్ నీల్ గట్టిగా ప్లాన్ చేశాడట?

praveen
ఇటీవల కాలంలో యాక్షన్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్ గా మారిపోయిన దర్శకుడు ప్రశాంత్ నీల్  కేజీఎఫ్ సినిమాతో ఎంతటి ప్రభంజనం సృష్టించాడో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అతని టేకింగ్ కి అన్ని వర్గాల ప్రేక్షకులు కూడా ఫిదా అయిపోయారు అని చెప్పాలి. ఇకపోతే ఇప్పుడు ఏకంగా పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తో ఒక సినిమా చేస్తున్నాడు ప్రశాంత్ నీల్. ఈ సినిమాకు సలార్ అనే టైటిల్ కూడా ఫిక్స్ చేశారూ అని చెప్పాలి. ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ శరవేగంగా  జరుగుతుంది.

 ప్రభాస్ లాంటి పెద్ద హీరోని అటు ప్రశాంత్ నీల్ ఎలా చూపించబోతున్నాడు అన్నది మాత్రం ప్రస్తుతం అందరిలో ఆసక్తి నెలకొంది అని చెప్పాలి. ఇక ఈ సినిమాకు సంబంధించి బయటికి వస్తున్న ఒక్కో న్యూస్ ప్రభాస్ సలార్ సినిమాపై అంతకంతకు అంచనాలను పెంచేస్తూ ఉంది. ఈ క్రమంలోనే ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించి మరో ఇంట్రెస్టింగ్ న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. ఈ సినిమా తెలుగు తమిళ హిందీ కన్నడ మలయాళ భాషల్లో భారీ రేంజ్ లో విడుదల కాబోతుంది. ఈ సినిమా ఒకటి కాదు రెండు పార్ట్ లుగా కూడా రాబోతుంది అన్నది కన్ఫర్మ్ అయింది.

 అయితే సలార్ సినిమా కోసం సినిమా చరిత్రలో ఎన్నడూ చూడని విధంగా యాక్షన్ సీన్స్ ప్లాన్ చేశారట ప్రశాంత్ నీల్. ప్రస్తుతం నడుస్తున్న టాక్ ప్రకారం అయితే సలార్ సినిమా విజువల్ ఫీస్ట్ కాబోతుంది అన్నది తెలుస్తుంది. ప్రశాంత్ నీల్, ప్రభాస్ కాంభో చిరకాలం గుర్తుండిపోయే విధంగా ఇక ఈ సినిమాలోని సన్నివేశాలు ఉంటాయట. హోంబలే ఫిలిమ్స్ ఇక ఖర్చు విషయంలో ఎక్కడ వెనక్కి తగ్గడం లేదట. హైటెక్నాలజీ ఉపయోగించి ప్రేక్షకులందరినీ కూడా మెస్మరైజ్ చేసేలా కొన్ని సీన్స్ ని తెరకెక్కిస్తున్నాడట ప్రశాంత్ నీల్. మొత్తంగా ఈ సినిమా ప్రేక్షకుల అంచనాలకు మించి ఉండబోతుందట.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: