రామోజీ ఫిలిం సిటీలో ఎన్టీఆర్... కొరటాల మూవీ షూటింగ్..!

Pulgam Srinivas
యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ "ఆర్ ఆర్ ఆర్" మూవీ విజయం తో ఫుల్ జోష్ లో తన తదుపరి మూవీ లను ఓకే చేస్తూ వెళ్తున్న విషయం మన అందరికీ తెలిసిందే . ఇప్పటికే ఎన్టీఆర్ ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న భారీ బడ్జెట్ మూవీ లో హీరో గా నటిస్తున్నాడు. ఈ సినిమాలో మోస్ట్ బ్యూటిఫుల్ నటి జాన్వి కపూర్ ... ఎన్టీఆర్ సరసన హీరోయిన్ గా కనిపించనుండగా ... సన్షేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ రవిచంద్రన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు .

ఈ మూవీ లో దేశ వ్యాప్తంగా అత్యంత ప్రజాదారణ పొందిన నటీనటులు కనిపించబోతున్నట్లు తెలుస్తోంది . ఈ సినిమాలో ప్రధాన ప్రతినాయకుడి పాత్రలో బాలీవుడ్ ఇండస్ట్రీ లో సూపర్ క్రేజ్ ఉన్నటు వంటి నటులలో ఒకరు అయినటు వంటి సైఫ్ అలీ ఖాన్ కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా మరి కొన్ని రోజుల్లోనే ఈ చిత్ర బృందం విడుదల చేయనున్నట్లు సమాచారం. ఇది ఇలా ఉంటే ఈ మూవీ షూటింగ్ కొన్ని రోజుల క్రితమే ప్రారంభం అయిన విషయం మనకు తెలిసిందే. ఈ మూవీ షూటింగ్ ఇప్పటికే మొదటి షెడ్యూల్ కూడా పూర్తయింది.

తాజాగా ఈ మూవీ యొక్క రెండవ షెడ్యూల్ ని రామోజీ ఫిలిం సిటీ లో ఈ చిత్ర బృందం ప్రారంభించింది. ప్రస్తుతం రామోజీ ఫిలిం సిటీ లో ఈ మూవీ బృందం రాత్రి వేళ సన్నివేశాలకు సంబంధించిన చిత్రీకరణను జరుపుతున్నట్లు తెలుస్తుంది. ఈ సినిమా ఎన్టీఆర్ కెరియర్ లో 30 వ మూవీ గా రూపొందబోతుంది. ఈ సినిమా తర్వాత ఎన్టీఆర్ "వార్ 2" మూవీ లోను ఆ తర్వాత ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపొందబోయే మూవీ లోను నటించబోతున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: