ఏంటి.. ఎన్టీఆర్ కృష్ణుడి పాత్రలో కనిపించబోతున్నాడా?

praveen
త్రిబుల్ ఆర్ సినిమా సూపర్ హిట్ తర్వాత అటు ఎన్టీఆర్ పాన్  ఇండియా స్టార్ గా మారిపోయాడు అన్న విషయం తెలిసిందే. అదే సమయంలోనే నాటు నాటు పాటకు ఆస్కార్ అవార్డు వచ్చిన తర్వాత ఇక ఎన్టీఆర్, రామ్ చరణ్ లు ఇద్దరు కూడా గ్లోబల్ స్టార్ హీరోలుగా మారిపోయారు. ఈ క్రమంలోనే ఇద్దరు హీరోలు నెక్స్ట్ మూవీ ల పై భారీ రేంజ్ లోనే అంచనాలు ఉన్నాయి అని చెప్పాలి.  ఇకపోతే బాలీవుడ్ డైరెక్టర్లు సైతం ఈ హీరోలతో సినిమాలు చేయాలని ఎంతగానో ఆశ పడుతున్నారు.. ఈ క్రమంలోనే జూనియర్ ఎన్టీఆర్ బాలీవుడ్ గ్రీక్ బాడ్ హృతిక్ రోషన్ సినిమాలో నటించబోతున్నట్లు గత కొన్ని రోజుల నుంచి వార్తలు వస్తున్నాయి..

 గత కొంతకాలం  నుంచి బాలీవుడ్ హీరోలు టాలీవుడ్ హీరోల సినిమాల్లో.. ఇక్కడ హీరోలు అక్కడి హీరోల సినిమాలో నటించడం ట్రెండ్ గా మారిపోయింది. ఈ క్రమంలోనే హృతిక్ రోషన్ హిట్ మూవీ వార్ సీక్వెల్లో  ఎన్టీఆర్ ఒక కీలక పాత్రలో నటించబోతున్నట్లు అఫీషియల్ ప్రకటన కూడా వచ్చింది. ఇక దీంతో అప్పటి నుంచి ఎన్టీఆర్ పాత్ర గురించి భారీ రేంజ్ లోనే అంచనాలు పెరిగిపోతున్నాయి అని చెప్పాలి. ఇక అభిమానుల అంచనాలను మరింత రెట్టింపు చేసే ఒక వార్తా ప్రస్తుతం సినీ ఇండస్ట్రీలో బాగా చక్కర్లు కొడుతుంది అని చెప్పాలి. కృష్ణార్జునల్లాగ కలిసి ఉండే ఇద్దరు ప్రాణ స్నేహితులు విడిపోతే ఎలా ఉంటుంది అనే విషయంపైనే వార్ 2 కథ సాగిపోతుందట.

 ఇక ఈ సినిమాలో అటు జూనియర్ ఎన్టీఆర్ పాత్ర కృష్ణుడి పాత్రను పోలి ఉంటుందని.. ఒక టాక్ ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతుంది. దీంతో ఎన్టీఆర్ పాత్ర గురించి అభిమానులందరూ కూడా ఊహాగానాల్లోకి వెళ్లిపోతున్నారు అని చెప్పాలి. ఇక ఈ సినిమాకు సంబంధించిన మరో అప్డేట్ ఏదైనా వస్తే బాగుండు అని వేయికళ్లతో ఎదురుచూస్తూ ఉన్నారు ఫ్యాన్స్. కాగా ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ అటు కొరటాల శివ సినిమాతో బిజీ బిజీగా ఉన్నాడు అన్న విషయం తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి:

Ntt

సంబంధిత వార్తలు: