అసలైన అందాన్ని చూపిస్తూ ఫోటోలను షేర్ చేసిన పూజ హెగ్డే..!!

Divya
గత ఏడాది వరుసగా బ్యాక్ టు బ్యాక్ సినిమాలలో నటించి తీవ్ర నిరాశకు గురైంది హీరోయిన్ పూజా హెగ్డే.. ప్రభాస్, విజయ్ దళపతి వంటి స్టార్ హీరోల సినిమాలలో నటించి ఘోరమైన అట్టర్ ప్లాప్లను చవిచూసింది ఈ ముద్దుగుమ్మ .అయినప్పటికీ కూడా ఈ ముద్దుగుమ్మకు ఆఫర్లు మాత్రం వెలుబడుతూనే ఉన్నాయి. ప్రస్తుతం సల్మాన్ ఖాన్ సరసన కీసీకా భాయ్ కీసీకీ జాన్ ఈ సినిమా త్వరలోనే విడుదలకు సిద్ధంగా ఉంది. దీంతో ఈ సినిమా ప్రచార కార్యక్రమంలో పూజా హెగ్డే భారీగా ప్రమోషన్స్ తో ఆకట్టుకుంటుంది.అందుకు సంబంధించిన కొన్ని ఫోటోలను కూడా షేర్ చేస్తూనే ఉంది.

తాజాగా పూజ హెగ్డే షేర్ చేసిన కొన్ని ఫోటోలు ఇంటర్నెట్ ని షేర్ చేసే విధంగా కనిపిస్తున్నాయి.పూజ హెగ్డే రియల్ గ్లామర్ యాంగిల్ ఒక్కసారిగా బయటపెట్టింది.. ఫెదర్ ఊల్ అల్లికలతో డిజైన్ చేసిన బ్లూ డెనిన్ లాంగ్ ఫ్రాకులో ఈ ముద్దుగుమ్మ అందాలు సంథింగ్ స్పెషల్ అన్నట్టుగా కనిపిస్తున్నాయి. ఇక బాటంలో బ్లూ బూత్ లెంగ్త్ మ్యాచింగ్ స్టైల్ లో ప్రత్యేక ఆకర్షణీయంగా నిలుస్తోంది ఎంపిక చేసుకున్న డిజైనర్ లుక్ లో తన థైస్ అందాలతో ఎలివేట్ చేస్తూ పూజ హెగ్డే మరింత హైలైట్ గా కనిపిస్తోంది.
కీసీకా భాయ్ కీసీకీ జాన్ ప్రమోషన్స్ లో పూజ హెగ్డే సౌత్ ఇండస్ట్రీ గురించి ప్రశంసల వర్షం కురిపించింది ఈ చిత్రంలో తను తెలుగు అమ్మాయిగా నటించానని దక్షిణాది చలనచిత్ర పరిశ్రమలు దశాబ్దం పాటు పనిచేసిన అనుభవం ఈ పాత్రను తనని సజావుగా నటించేలా చేశాయని తెలియజేస్తోంది. తను తెలుగులో డైలాగులను సులభంగా పలికానని తెలిపింది అలాగే సల్మాన్ ఖాన్ తో డేటింగ్ పుకార్ల పైన కూడా ఖండించడం జరిగింది. ప్రస్తుతం తాను ఒంటరిగానే ఉన్నానని ఒంటరిగానే ఉండడానికి ఇష్టపడుతున్నానని తెలియజేసింది. ప్రస్తుతం పూజ హెగ్డే కు సంబంధించి ఈ ఫోటోలు వైరల్ గా మారుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: