IMBD.. టాప్ ప్లేస్ లో నిలిచిన నేషనల్ క్రష్..!!

Divya

టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో ఉండే హీరోయిన్స్ సైతం ఈ మధ్యకాలంలో పాన్ ఇండియా లేవలో హీరోయిన్ గా పేరు సంపాదించాలని పలు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. అలా ప్రయత్నాలు చేస్తున్న హీరోయిన్లలో రష్మిక కూడా ఒకరు. ఇమెను ముద్దుగా అభిమానులు నేషనల్ క్రష్ అని పిలుస్తూ ఉంటారు. తాజాగా IMBD అనే ఆన్లైన్ పోర్టల్ సినీ సెలబ్రిటీలకు సంబంధించి ప్రతి నెల రేటింగ్ ఇస్తూ మంచి పాపులారిటీ సంపాదించుకుంది.ఇప్పుడు ఇండియన్ సెలబ్రెటీల జాబితాను విడుదల చేయడం జరిగింది. అందులో హీరోయిన్ రష్మిక మూడో స్థానాన్ని సంపాదించుకోవడం  గమనార్హం.
ఇటీవలే పుష్ప -2 సినిమా నుంచి విడుదలైన టీజర్.. ఆమె పుట్టినరోజు సందర్భంగా విడుదలైన పోస్టర్తో మంచి పాపులారిటీ సంపాదించుకుంది రష్మిక. IMBD టాప్ 10 జాబితాను విడుదల చేయడం జరిగింది. ఇందులో మూడవ స్థానంలో రష్మిక నిలవడంతో ఆమె అభిమానులు తెగ ఆనందపడుతున్నారు. రష్మిక పుష్ప -2 సినిమాతోపాటు నితిన్ సరసన డైరెక్టర్ వెంకీ కుడుముల దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న రెయిన్బో అనే చిత్రంలో కూడా నటించబోతోంది .అత్యధిక రెమ్యూనరేషన్ తీసుకుంటున్న హీరోయిన్లలో రష్మిక కూడా ముందువరుసలో ఉన్నది.

అలాగే బాలీవుడ్ లో కూడా పలు చిత్రాలలో నటిస్తూ బిజీగా ఉంటోంది ఈ ముద్దుగుమ్మ. ముఖ్యంగా డైరెక్టర్ సందీప్ వంగా తెరకెక్కిస్తున్న యానిమల్ చిత్రంలో కూడా హీరోయిన్గా నటిస్తున్నది ఈ సినిమా త్వరలోనే విడుదలకు సిద్ధంగా ఉన్నది. ఇలా ఒకవైపు వరుస సినిమాలలో నటిస్తూనే సోషల్ మీడియాలో కూడా తన పర్సనల్ లైఫ్ కు సంబంధించి విషయాలతో పాటు గ్లామర్ ఫోటోలను కూడా షేర్ చేస్తూ మంచి పాపులారిటీ సంపాదించుకుంది. సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న కారణంగా రష్మికకి  imbd టాప్ సెలబ్రిటీ జాబితాలో చోటు తగ్గించుకుంది. మరి రాబోయే రోజుల్లో రష్మిక జోరు మరింత పెరగడం ఖాయం అంటూ అభిమానులు కామెంట్లు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: