KGF 3: శాండిల్ వుడ్ లాంటి చిన్న ఇండస్ట్రీలో సంచలన సినిమాగా మారి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన సినిమా కేజీఎఫ్ సిరీస్. అప్పటిదాకా మరుగున పడ్డ కన్నడ సినిమా ఇండస్ట్రీకి భారీగా పాన్ ఇండియా మార్కెట్ ని తీసుకొచ్చింది kgf సిరీస్. ఇక తాజాగా ఈ సిరీస్ పై నిర్మాతలు సంచలనమైన వీడియోను షేర్ చేశారు.హోంబలే ఫిల్మ్ నిర్మించిన కేజీఎఫ్ సిరీస్ బాక్సాఫీస్ వద్ద కన్నడ సినిమా రికార్డులని బ్రేక్ చేసింది. అంతేకాదు బాక్స్ ఆఫీస్ వద్ద కాసుల కనక వర్షం కురిపించింది.కేజీఎఫ్ సిరీస్‌లో రెండవ పార్టు విడుదలై శుక్రవారంతో ఒక సంవత్సరం పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా మూడవ పార్ట్ కూడా త్వరలో ఉంటుందని అందుకు సంబంధించిన ఒక వీడియోను సోషల్‌మీడియా ద్వారా షేర్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతుంది.ప్రస్తుతం ప్రశాంత్ నీల్ ప్రభాస్ తో సలార్ అనే భారీ బడ్జెట్ పాన్ ఇండియా సినిమా తీస్తున్నారు.
దీనిపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇంకా అంతేకాదు ప్రశాంత్ నీల్ ఎన్టీఆర్‌తో కలిసి కూడా సినిమా చేయబోతున్నారు. ఈ రెండింటీ తర్వాత ఈ kgf మూడవ భాగం ఉంటుందని శాండల్‌వుడ్‌లో టాక్. kgf 2 లో రావురమేష్, రవీనా టాండన్, ప్రకాశ్‌రాజ్ కీలకపాత్రలో నటించగా శ్రీనిధి షెట్టి హీరోయిన్గా బాలీవుడ్ నటుడు సంజయ్‌దత్ ప్రతినాయకుడి పాత్రలో నటించి మెప్పించారు. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 1200 కోట్లకు పైగా వసూళ్లు సాధించి కన్నడ సినిమా స్టామినా ఏంటో చూపించింది.ముఖ్యంగా బాలీవుడ్ లో చాలా రికార్డులని బద్దలు కొట్టింది. ఈ సినిమా రిలీజ్ అయిన అన్ని లాంగ్వేజ్ లో కూడా 100 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. ఇక kgf పార్ట్ 3 ఇంకెన్ని రికార్డులు నమోదు చేస్తుందో చూడాలి.