ఎన్టీఆర్ "వార్ 2" మూవీ షూటింగ్ స్టార్ట్ అయ్యేది అప్పటి నుండే..?

Pulgam Srinivas
యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం తన కెరీర్ లో 30 వ మూవీ గా రూపొందు తున్న సినిమా లో హీరో గా నటిస్తున్నాడు . కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ కి అనిరుద్ రవిచంద్రన్ సంగీతం అందిస్తూ ఉండ గా ... బాలీవుడ్ మోస్ట్ హాటెస్ట్ బ్యూటీ జాన్వి కపూర్ ఈ సినిమాలో ఎన్టీఆర్ సరసన హీరోయిన్ గా నటించబోతోంది . ఈ మూవీ లో బాలీవుడ్ ఇండస్ట్రీ లో సూపర్ క్రేజ్ ఉన్న నటులలో ఒకరు అయినటు వంటి సైఫ్ అలీ ఖాన్ ప్రధాన ప్రతి నాయకుడి పాత్రలో కనిపించబోతున్నట్లు తెలుస్తోంది .

ఇప్పటికే ఈ మూవీ బృందం ఈ సినిమా లోని ప్రతి నాయకుడి పాత్రకు సంబంధించిన కథను సైఫ్ కు వివరించగా తన పాత్ర అద్భుతంగా నచ్చిన సైఫ్ ఈ మూవీ లో ప్రతి నాయకుడి పాత్రలో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది . మరి కొన్ని రోజుల్లోనే ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడ బోతున్నట్లు తెలుస్తోంది . ఈ మూవీ యొక్క షూటింగ్ ను ప్రస్తుతం ఈ చిత్ర బృందం ఎన్టీఆర్ 30 అనే వర్కింగ్ టైటిల్ తో పూర్తి చేస్తూ వస్తుంది .

ఇది ఇలా ఉంటే ఎన్టీఆర్ ఈ మూవీ తర్వాత అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో హిందీ సినిమా వార్ 2 హీరో గా నటించబోతున్నాడు . ఈ మూవీ లో ఎన్టీఆర్ తో పాటు బాలీవుడ్ హీరో హృతిక్ రోషన్ కూడా హీరో గా నటించబోతున్నాడు. ఇప్పటికే ఈ మూవీ కి సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వెలబడింది. ఇలా ఉంటే ఈ మూవీ యొక్క రెగ్యులర్ షూటింగ్ ఈ సంవత్సరం నవంబర్ నెల నుండి ప్రారంభం కాబోతున్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: