బాలకృష్ణ "అఖండ 2" లో అవే హైలెట్..?

Pulgam Srinivas
నందమూరి నట సింహం బాలకృష్ణ తన కెరీర్ లో ఇప్పటి వరకు ఎన్నో అదిరిపోయే బ్లాక్ బాస్టర్ మూవీ లలో హీరో గా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. బాలకృష్ణ నటించిన బ్లాక్ బాస్టర్ మూవీ లలో అఖండ మూవీ ఒకటి. ఈ సినిమా 2020 సంవత్సరం విడుదల అద్భుతమైన విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకొని భారీ కలెక్షన్ లను బాక్స్ ఆఫీస్ దగ్గర రాబట్టింది. ఈ మూవీ కి టాలీవుడ్ మాస్ దర్శకుడు బోయపాటి శ్రీను దర్శకత్వం వహించగా ... మోస్ట్ బ్యూటిఫుల్ నటి ప్రగ్యా జైస్వాల్ ఈ సినిమాలో బాలకృష్ణ సరసన హీరోయిన్ గా నటించింది. 

పూర్ణ ఈ మూవీ లో ఒక కీలకమైన పాత్రలో నటించగా ... శ్రీకాంత్ ఈ మూవీ లో విలన్ పాత్రలో నటించాడు. తమన్ ఈ మూవీ కి సంగీతం అందించాడు. తమన్ అందించిన సంగీతం కూడా ఈ మూవీ విజయంలో అత్యంత కీలక పాత్రను పోషించింది. ఈ మూవీ లో బాలకృష్ణ డ్యూయల్ రోల్ లో నటించాడు. ఈ మూవీ లోని రెండు పాత్రలలోనూ బాలకృష్ణ తన అద్భుతమైన నటనతో ప్రేక్షకులను అలరించాడు.

ఇది ఇలా ఉంటే అఖండ మూవీ కి సీక్వల్ గా అఖండ 2 మూవీ రానున్నట్లు కొన్ని రోజుల క్రితమే బాలకృష్ణ అధికారికంగా ప్రకటించిన విషయం మన అందరికీ తెలిసిందే. అలాగే అఖండ 2 మూవీ ని ఈ సంవత్సరం బాలకృష్ణ పుట్టిన రోజు సందర్భంగా జూన్ 10 వ తేదీన అధికారికంగా లాంచింగ్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఇది ఇలా ఉంటే అఖండ 2 మూవీ లో కూడా బాలకృష్ణ డ్యూయల్ రోల్ లో కనిపించబోతున్నట్లు ... ఈ మూవీ లో రాజకీయ అంశాలు ప్రధానంగా ఉండబోతున్నట్లు తెలుస్తోంది. అలాగే ఈ మూవీ లోని రాజకీయ అంశాలు ఈ మూవీ కి హైలెట్ గా నిలవనున్నట్లు తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: