ఈసారి సంక్రాంతి పోరు గట్టిగానే ఉండనుందా..?

Pulgam Srinivas
సంక్రాంతి పండుగ వచ్చింది అంటే టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర ఎప్పుడు లేని సందడి వాతావరణం కనిపిస్తూ ఉంటుంది అన్న విషయం మన అందరికీ తెలిసిందే. ఇది ఇలా ఉంటే వచ్చే సంవత్సరం కూడా సంక్రాంతి పండుగకు టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర అద్భుతమైన సందడి వాతావరణం కనిపించే అవకాశాలు ఉన్నాయి. ఇది ఇలా ఉంటే వచ్చే సంవత్సరం సంక్రాంతి కానుకగా తమ సినిమాలను విడుదల చేయబోతున్నట్లు కొన్ని చిత్ర బృందాలు ఇప్పటికే అధికారికంగా ప్రకటించాయి.

అలాగే మరికొన్ని సినిమాలను వచ్చే సంవత్సరం సంక్రాంతికి విడుదల చేయాలి అని మేకర్స్ ప్లానింగ్ లో ఉన్నారు. అలా వచ్చే సంవత్సరం సంక్రాంతి కి విడుదల కాబోయే సినిమాలు ఏవో తెలుసుకుందాం. ప్రభాస్ హీరోగా దీపికా పదుకొనే హీరోయిన్ గా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్రాజెక్టు కే అనే భారీ బడ్జెట్ మూవీ రూపొందుతున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ ని వచ్చే సంవత్సరం సంక్రాంతి కానుకగా విడుదల చేయనున్నట్లు మూవీ యూనిట్ ఇప్పటికే ప్రకటించింది.

మహేష్ హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో రూపొందుతున్న మూవీ ని వచ్చే సంవత్సరం జనవరి 13 వ తేదీన విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం ఇప్పటికే అధికారికంగా ప్రకటించింది. పవన్ కళ్యాణ్ హీరోగా హరీష్ శంకర్ దర్శకత్వంలో ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ రూపొందుతున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ ని కూడా వచ్చే సంవత్సరం సంక్రాంతి కి విడుదల చేసే ఆలోచనలో ఈ మూవీ యూనిట్ ఉన్నట్లు తెలుస్తుంది. కమల్ హాసన్ హీరోగా శంకర్ దర్శకత్వంలో ఇండియన్ 2 మూవీ రూపొందుతున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ ని కూడా వచ్చే సంవత్సరం సంక్రాంతి కానుకగా విడుదల చేసే ఆలోచనలో ఈ మూవీ యూనిట్ ఉన్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: