సుహాస్ కొత్త మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల..!

Pulgam Srinivas
తెలుగు సినిమా ఇండస్ట్రీ లో మంచి నటుడి గా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును ఏర్పరచుకున్న వారిలో సుహాస్ ఒకరు. ఈ నటుడు కెరియర్ ప్రారంభంలో చిన్న చిన్న పాత్రలలో నటించి నటుడిగా తనకంటూ ఒక మంచి గుర్తింపును తెలుగు సినిమా ఇండస్ట్రీ లో ఏర్పాటు చేసుకున్నాడు. ఆ తర్వాత  కలర్ ఫోటో మూవీ లో హీరో గా నటించిన సుహాస్ ఈ మూవీ ద్వారా అద్భుతమైన గుర్తింపును సంపాదించుకున్నాడు. ఈ మూవీలో చాందిని చౌదరి హీరోయిన్ గా నటించింది. ఈ మూవీ లోని నటన గాను సూహస్ కు అద్భుతమైన ప్రశంసలు లభించాయి. 

ఆ తర్వాత నుండి సుహాస్ వరుస క్రేజీ సినిమాలలో అవకాశాలను దక్కించుకుంటున్నాడు. అందులో భాగంగా కొంత కాలం క్రితమే ఈ యువ నటుడు హిట్ ది సెకండ్ కేస్ మూవీ లో ప్రతి నాయకుడి పాత్రలో నటించి తన నటనతో ప్రేక్షకులను అలరించాడు. తాజాగా సుహాస్ "రైటర్ పద్మభూషణ్" అనే మూవీ లో హీరో గా నటించాడు. ఈ మూవీ మంచి విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకుంది. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ యువ హీరో "అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్" అనే సినిమాలో హీరో గా నటించాడు.

తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ ను ఈ చిత్ర బృందం విడుదల చేసింది. ఈ ఫస్ట్ లుక్ పోస్టర్ లో సుహాస్ బ్యాండ్ పట్టుకొని నిలబడి ఉన్నాడు. ప్రస్తుతం ఈ పోస్టర్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.  గీతా ఆర్ట్స్ 2, ధీరజ్ మొగిలినేని ఎంటర్టైన్మెంట్స్ , మహాయనా మోషన్ పిక్చర్స్ సంస్థల పై గ్రాండ్ గా నిర్మితం అవుతున్న ఈమూవీ ని దుశ్యంత్ కటికనేని తెరకెక్కిస్తుండగా బన్నీ వాస్, వెంకటేష్ మహా ఈ మూవీ కి సమర్పకులుగా వ్యవహరిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: