అమర్ దీప్ తో అర్ధ రాత్రి రీతూ చౌదరి ఆ పని చేసిందా..?

murali krishna
బుల్లి తెర ధారా వాహిక అయిన జానకి కలగనలేదు  లో హీరోగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న నటుడు అమర్ దీప్. తన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.
బుల్లితెర నటుడిగా ఎంతో క్రేజ్ సొంతం చేసుకున్న అమర్ పలు బుల్లితెర కార్యక్రమాలలో కూడా పెద్ద ఎత్తున సందడి చేస్తూ కనిపిస్తారు..అలాగే సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా ఉంటూ తనకు సంబంధించిన అన్ని విషయాలను అభిమానులతో బాగా షేర్ చేసుకుంటారు.తాజాగా ఈయన అర్ధరాత్రి రోడ్లపై జబర్దస్త్ నటి రీతూచౌదరితో చేసిన రచ్చ మామూలుగా అయితే లేదు ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో  తెగ వైరల్ గా మారింది.
అమర్ దీప్ కి వీలు దొరికినప్పుడల్లా రీల్స్ చేస్తూ వాటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం మనం చూస్తూ ఉన్నాము. అయితే తాజాగా జబర్దస్త్ నటి రీతు చౌదరితో కలిసి ఈయన అర్ధరాత్రి రోడ్లపై పెద్ద ఎత్తున సందడి చేశారని తెలుస్తుంది.అమర్ దీప్ బాద్ షా సినిమాలోని బ్రహ్మనందం రీల్ చేసి అందరిని కడుపుబ్బా నవ్వించాడు. రీతూ దసరా మూవీలోని కీర్తి సురేష్ చేసిన బరాత్ డ్యాన్స్ చేసి తెగ అలరించింది.వీరిద్దరు కలిసి ఓ తమిళ్ సాంగ్ కు కూడా డ్యాన్స్ వేశారు. ఇక ఈ వీడియో చూసిన నేటిజన్స్ అమర్ దీప్ యాక్టింగ్ సూపర్ అంటూ కామెంట్ లు చేస్తున్నారటా అయితే ఈ వీడియోలో మరి కొంతమంది బుల్లితెర నటులు కూడా కనిపించి తెగ సందడి చేశారు. ఇలా వీరిద్దరూ కలిసి రీల్స్ చేయడంతో ఇద్దరు కలిసి ఏదైనా వెబ్ సిరీస్ ప్లాన్ చేస్తున్నారా అందుకే ఇలా ఇద్దరూ కలిసి రీల్స్ చేస్తున్నారా అంటూ పలు సందేహాలను వ్యక్తం చేస్తున్నారటా.. ఇక అమర్ దీప్ బుల్లితెర నటి తేజస్విని గౌడను పెళ్లి చేసుకున్న సంగతి కూడా తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: