శ్రద్ధా దాస్ కు మంచి మైలేజ్ ఇస్తున్న ఢీ షో..!

shami
తెలుగులో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చి సక్సెస్ అవలేక సైడ్ రోల్స్ గ్లామర్ రోల్స్ చేస్తూ వస్తున్న భామ శ్రద్ధా దాస్. అయితే అమ్మడు ఇప్పుడు స్మాల్ స్క్రీన్ మీద సత్తా చాటుతుంది. ఢీ షో జడ్జ్ గా శ్రద్ధా దాస్ మెప్పిస్తుంది. పక్కన శేఖర్ మాస్టర్ తో కలిసి ఆమె జడ్జ్ మెంట్ బాగుంటుంది. అంతేకాదు ఆమె వచ్చి రాని తెలుగు మాటలకు ఆడియన్స్ కూడా ఫిదా అవుతున్నారు. ఢీ షో 10వ సీజన్ వరకు కేవలం డ్యాన్స్ షో మాత్రమే అన్నట్టు ఉండేది కానీ ఇప్పుడు అందులో హైపర్ ఆది కామెడీ కూడా యాడ్ చేసి జబర్దస్త్ విత్ ఢీ షో చేశారు.
ఈ సీజన్ ఛాంపియన్స్ బ్యాటిల్ లో కంటెస్టంట్స్ తో పాటుగా డ్యాన్స్ మాస్టర్స్ కూడా తమ సత్తా చాటాలని చూస్తున్నారు. ఇక ఈ షో ద్వారా శ్రద్ధా దాస్ మళ్లీ ఫాం లోకి వచ్చినట్టే అనిపిస్తుంది. ఢీ షో ద్వారా వార్తల్లో నిలుస్తున్న శ్రద్ధా దాస్ మరోపక్క ఫోటో షూట్స్ తో అలరిస్తుంది. హీరోయిన్ గా ఫెయిల్ అయినా సరే ఇప్పటికీ శ్రద్ధా దాస్ వార్తల్లో ఉండటం అందరిని అలరిస్తుంది.
హీరోయిన్ గా ఎలాగు ఆఫర్లు లేవని వచ్చిన ప్రతి చిన్న పాత్రను చేస్తూ వచ్చింది శ్రద్ధ దాస్. హాట్ షోలో అమ్మడు ఎక్కడ వెనకడుగు వేయదు. మరీ ముఖ్యంగా ఇన్ స్టాగ్రాం లో తన హాట్ ఫోటో షూట్స్ తో కుర్రాళ్లను తెగ డిస్టర్బ్ చేస్తుంది శ్రద్ధా దాస్. ప్రస్తుతం ఈటీవీ ఢీ షోతో అమ్మడికి మంచి మైలేజ్ వచ్చింది. ఢీ షో ద్వారా మళ్లీ ఆడియన్స్ ముందుకు రాగా తనకు వచ్చిన ఈ క్రేజ్ ని మళ్లీ సినిమాల్లో వాడుకోవాలని చూస్తుంది. ఢీ షోలో ఆమె వచ్చీ రాని తెలుగులో ఆడియన్స్ ని అలరిస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: