' రావణాసుర ' సినిమా థియేటర్స్ లో ప్రభాస్ ఫ్యాన్స్ హంగామా .......!!

murali krishna
టాలీవుడ్ మాస్ మహారాజా రవితేజ గురించి ప్రత్యేకం గా పరిచయం అక్కర్లేదు. రవితేజ ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాలలో నటిస్తూ దూసుకుపోతున్న విషయం తెలిసిందే.
ఇటీవల ధమాకా సినిమాతో ప్రేక్షకులను పలకరించిన రవితేజ తాజాగా ఏప్రిల్ 7వ తేదీన రావణాసుర సినిమా తో ప్రేక్షకులను పలకరించారు. ఇప్పటికే ఈ సినిమా హిట్టు టాక్ ని సొంతం చేసుకుంది. కాగా భారీ అంచనాల నడుమ రావణాసుర సినిమా నేడు విడుదలైన విషయం తెలిసిందే. ఇప్పటికే సోషల్ మీడియాలో రవితేజ అభిమానుల హంగామా మొదలైంది.
మాస్ మహారాజా మరో హిట్టు కొట్టాడు అంటూ పోస్టులు పెడుతున్నారు. రవితేజ బ్యాక్ టు బ్యాక్ వరుసగా సినిమాలతో ప్రేక్షకులను పలకరించడంతోపాటు అన్ని హిట్ అవుతుండగా అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇది ఇలా ఉంటే ఈ సెలబ్రేషన్స్ లో ప్రభాస్ ఫ్యాన్స్ కూడా జాయిన్ అయ్యారు. అదెలా అనుకుంటున్నారా. రావణాసుర సినిమాలో ప్రభాస్ ప్రస్తావన రావడంతో ప్రభాస్ అభిమానులు కూడా సంతోషంగా ఫీల్ అవుతున్నారు. సినిమాలో ఒక కేసు ఇన్వెస్టిగేషన్లో భాగంగా జయరాం ఒక రౌడీ ఇంటికి వెళ్ళిన సందర్భంలో ప్రభాస్ ప్రస్తావన వస్తుంది. లండన్ మేడం టుస్సాడ్స్ లో మా అన్న విగ్రహం పెడతాను అన్నారంటూ డైలాగ్ ఉంటుంది. అప్పుడు జయరాం మేడం టుస్సాడ్స్ విగ్రహం పెట్టడానికి మీ అన్న ఏమైనా ప్రభాసా, విరాట్ కోహ్లీ నా అనే ప్రశ్నిస్తాడు. ఈ ఒక్క డైలాగ్ తో తీయడం మొత్తం అరుపులతో రీసౌండ్ వచ్చింది. దీంతో ప్రభాస్ అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. సుధీర్ వర్మ దర్శకత్వం వహించిన ఈ సినిమాతో రవితేజ మరో హిట్ టాక్ను తన ఖాతాలో వేసుకున్నారు. సినిమా మొత్తం ట్విస్టులు, ఎలివేషన్స్ తో ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. ఇందులో ప్రభాస్ టాపిక్ రావడంతో ఈ సినిమాకు మరింత హైప్ వచ్చిందని చెప్పవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: