రావణాసుర: ప్లస్ & మైనస్లు ఇవే?

Purushottham Vinay
రావణాసుర: ప్లస్ & మైనస్లు ఇవే?

ఇక రీసెంట్ గా 'ధమాకా', వాల్తేరు వీరయ్య' చిత్రాలతో వరుసగా రెండు వంద కోట్ల విజయాలను అందుకోని మునుపటి ఫామ్ లోకి వచ్చిన మాస్ రాజా రవితేజ టైటిల్ పాత్రలో  విడుదలైన తాజా చిత్రం 'రావణాసుర'.టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ డైరెక్టర్ సుధర్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా నేడు (ఏప్రిల్ 07) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. చాలా కాలం తర్వాత రవితేజ మళ్ళీ నెగిటివ్ షేడ్ లో కనిపించిన ఈ సినిమా ఆడియన్స్ ను ఏమేరకు అలరించింది? మాస్ రాజా రవితేజకు హ్యాట్రిక్ హిట్ అందించిందా? లేదా? వంటి విషయాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం.మాస్ రాజా రవితేజ ఎలాంటి పాత్రనైనా చాలా అద్భుతంగా పండిస్తాడు అనేది అందరికి తెలిసిన విషయమే. ఇక రావణాసుర సినిమాలో నెగిటివ్ రోల్ లో ఎవరూ ఊహించని విధంగా రెచ్చిపోయాడు మన మాస్ రాజా రవితేజ. 


ఈ రేంజ్ లో రవితేజను చూడని ప్రేక్షకులు అవాక్కైన సందర్భాలు బోలెడున్నాయి. ముఖ్యంగా ఇంటర్వెల్ బ్లాక్ తో అయితే నిజంగానే షాక్ ఇచ్చాడు రవితేజ. అయితే.. సెకండాఫ్ లో క్యారెక్టర్ గ్రాఫ్ ను సరిగా బిల్డ్ చేయకపోవడంతో, అప్పటి దాకా ఇచ్చిన బిల్డప్ అంతా కూడా తగ్గిపోయింది. అయినా కూడా రవితేజను కాస్త మూస నుంచి బయటకు తీసుకొచ్చిన సినిమా ఇదే అని చెప్పొచ్చు.ఫారియా, మేఘా ఆకాష్ ఇంకా సుశాంత్ ల పాత్రలు కథా గమనానికి ప్లస్ అయ్యాయి. ఇద్దరి స్క్రీన్ ప్రెజన్స్ కూడా చాలా బాగుంది. అను ఇమ్మాన్యూల్. దక్ష నాగార్కర్, పూజిత పొన్నాడ అయితే కేవలం క్యారెక్టర్ ఆర్టిస్టులుగా మిగిలిపోయారు.వాళ్ళ వల్ల పెద్ద యూజ్ ఏం లేదు. ఇక మలయాళ నటుడు జయరాంకు అయితే చక్కని పాత్ర లభించింది. ఇక హైపర్ ఆది కామెడీ అయితే అంతగా వర్కవుటవ్వలేదు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: