మొదటి మూవీతోనే 100 కోట్ల గ్రాస్ కలెక్షన్లను అందుకున్న సౌత్ ఇండియన్ దర్శకులు వీరే..!

Pulgam Srinivas
సౌత్ సినిమా ఇండస్ట్రీ లోకి ప్రతి సంవత్సరం ఎంతో మంది కొత్త దర్శకులు ఎంట్రీ ఇస్తున్నారు. వారిలో కొంత మంది దర్శకత్వం వహించిన సినిమాలకు బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి కలెక్షన్ లు వస్తూ ఉంటే ... మరి కొంత మంది దర్శకులు దర్శకత్వం వహించిన సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొడుతున్నాయి. ఇది ఇలా ఉంటే సౌత్ సినిమా ఇండస్ట్రీ నుండి దర్శకుడిగా దర్శకత్వం వహించిన మొట్ట మొదటి మూవీ తోనే 100 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను అందుకున్న దర్శకులు కొంత మంది ఉన్నారు. ఆదర్శకులు ఎవరు అనేది తెలుసుకుందాం.
పృథ్వీరాజ్ సుకుమారన్ : అద్భుతమైన టాలెంట్ ఉన్న నటుడు మరియు దర్శకుడు అయినటువంటి పృధ్వీరాజ్ సుకుమారన్ గురించి ప్రత్యేకంగా ఇండియన్ సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. పృథ్వీరాజ్ 2019 వ సంవత్సరం విడుదల అయినటువంటి లూసీఫర్ మూవీ కి దర్శకత్వం వహించాడు. ఇది దర్శకుడిగా పృధ్విరాజ్ కు డెబ్యూ మూవీ. ఈ సినిమాలో మోహన్ లాల్ హీరో గా నటించాడు. ఈ మూవీ 100 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్ లను బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకుంది.
సిబి చక్రవర్తి : ఈ దర్శకుడు డాన్ అనే మూవీ తో దర్శకుడుగా తన కెరియర్ ను పద్ధతులు పెట్టాడు. ఈ మూవీ 2022 వ సంవత్సరం విడుదల అయింది. ఈ సినిమాలో శివ కార్తికేయన్ హీరో గా నటించాడు. ఈ మూవీ 100 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్ లను బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకుంది.
శ్రీకాంత్ ఓదెల : ఈ దర్శకుడు తాజాగా ఈ సంవత్సరం మార్చి 30 వ తేదీన విడుదల అయినటువంటి దసరా అనే మూవీ కి దర్శకత్వం వహించాడు. నాని ఈ మూవీ లో హీరోగా నటించగా ... కీర్తి సురేష్ ఈ మూవీ లో హీరోయిన్ గా నటించింది. ఏ మూవీ ఇప్పటికే 100 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్ లను బాక్స్ ఆఫీస్ దగ్గర వసూలు చేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: