ఆ క్రేజీ కాంబినేషన్లో మరో సినిమా..!

Pulgam Srinivas
ఈ మధ్య కాలంలో తెలుగు సినిమా ఇండస్ట్రీ లో మంచి గుర్తింపును తెచ్చుకున్న నిర్మాత లలో అభిషేకం నామ ఒకరు. ఈయన ఇప్పటికే కొన్ని సినిమా లను నిర్మించి అందులో కొన్ని మూవీ లతో మంచి విజయాలను అందుకొని తెలుగు సినిమా ఇండస్ట్రీ లో తన కంటూ ఒక మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ నిర్మాత మాస్ మహారాజ రవితేజ హీరో గా రూపొందినటు వంటి రావణాసుర మూవీ ని నిర్మించాడు.

 ఈ మూవీ కి సుధీర్ వర్మ దర్శకత్వం వహించాడు. ఈ మూవీ ఏప్రిల్ 7 వ తేదీన థియేటర్ లలో విడుదల కాబోతుంది. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ నిర్మాత కొన్ని ఆసక్తికరమైన విషయాలు చెప్పుకొచ్చాడు. తాజాగా అభిషేక్ నామ మాట్లాడుతూ ... రావణాసుర కాంబినేషన్ లో మరో మూవీ త్వరలోనే ఉండబోతుంది అని చెప్పుకొచ్చాడు. దీనితో రవితేజ ... సుధీర్ వర్మ కాంబినేషన్ లో ఎలాంటి మూవీ ఉంటుందా అని కొంత మంది సినీ ప్రేమికులు ఇప్పటి నుండే చర్చించు కోవడం మొదలు పెట్టారు.

ఇది ఇలా ఉంటే ఇప్పటికే రావణాసుర మూవీ నుండి చిత్ర బృందం విడుదల చేసిన ప్రచార చిత్రాలు ... పాటలు ... టీజర్ ... ట్రైలర్ ప్రేక్షకులను ఆకట్టు కునే విధంగా ఉండడంతో ఈ మూవీ పై తెలుగు సినీ ప్రేమికుల్లో మంచి అంచనాలు ఉన్నాయి. మరి మంచి అంచనాలు కలిగి ఉన్న ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఏ రేంజ్ విజయాన్ని అందుకుంటుందో చూడాలి. ఈ మూవీ లో రవితేజ సరసన ఏకంగా ఐదుగురు ముద్దు గుమ్మలు హీరోయిన్ లుగా కనిపించబోతున్నారు. టాలీవుడ్ ఇండస్ట్రీ లో సూపర్ క్రేజ్ ఉన్న యువ హీరోలలో ఒకరు అయినటు వంటి సుశాంత్ ఈ మూవీ లో ఒక కీలకమైన పాత్రలో కనిపించనున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: