లోకేష్ కనకరాజ్ యూనివర్స్ లోకి.. మరో స్టార్ హీరో.. ఇక అరాచకమే?

praveen
తమిళ ఇండస్ట్రీలో ఖైదీ , మాస్టర్,  విక్రమ్ అనే సినిమాలతో తనకంటూ ఒక ప్రత్యేకమైన బ్రాండ్ క్రియేట్ చేసుకున్నాడు డైరెక్టర్ లోకేష్ కనకరాజ్. అంతేకాదు ఖైదీ, విక్రమ్ సినిమాలను అటాచ్ చేసి ఒక యూనివర్స్ ని క్రియేట్ చేశాడు అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఇక ఈ సిరీస్ లోనే వరుసగా మూవీలను చేస్తూ వస్తున్నాడు. కాగా ప్రస్తుతం అటు ఇళయ దళపతి విజయ్ తో సినిమా చేస్తున్నాడు.  ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ 25% కంప్లీట్ అయింది. అయితే ఇటీవల ఒక అవార్డు వేడుకలో సూర్యతో కూడా ఒక సినిమా ఉంటుంది అంటూ హింట్ ఇచ్చాడు లోకేష్ కనకరాజ్.

 సూర్యతో తెరకెక్కించబోయే మూవీ నుండి 150 రోజుల్లోనే పూర్తి చేస్తాను అంటూ కూడా చెప్పాడు. ఇకపోతే ఇప్పుడు తమిళ అభిమానులు అందరూ కూడా సంతోషంలో మునిగిపోయే ఒక పండుగ లాంటి న్యూస్ తెరమీదికి వచ్చింది.  ఏకంగా సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా లోకేష్ కనకరాజు ఒక మూవీ ప్లాన్ చేస్తున్నాడట. ఇందుకు సంబంధించిన చర్చలు జరుగుతున్నట్లు తెలుస్తుంది. కోలీవుడ్ లో బిగ్ ప్రొడక్షన్ హౌస్ ఇక ఈ కాంబినేషన్ సినిమాను నిర్మించడానికి సిద్ధమైంది అని సమాచారం. ఇక ఈ సినిమాకు సంబంధించిన చర్చలు ప్రస్తుతం ఫైనల్ స్టేజ్లో ఉన్నాయి అన్నది తెలుస్తుంది. ఇక దీనిపై మరికొన్ని రోజుల్లోనే క్లారిటీ వచ్చే అవకాశం ఉందట.

 అయితే లోకేష్ కనకరాజ్ ముందు నుంచి ప్లాన్ చేసుకున్న యూనివర్స్ సిరీస్ లో భాగంగానే అటు రజనీకాంత్ తో కూడా సినిమా ఉండబోతుందనే మాట కోలీవుడ్ సర్కిల్లో ఎక్కువగా వినిపిస్తుంది. సాధారణంగానే అటు లోకేష్ కనకరాజ్ హీరోలను ఎంతో పవర్ఫుల్ గా చూపిస్తాడు. ఇక అలాంటిది పవర్ఫుల్ హీరో అయినా రజినీకాంత్ ను ఇంకెంత పవర్ఫుల్ గా చూపిస్తాడో అని అభిమానులు అంచనాలు పెంచుకుంటున్నారు. కాగా ప్రస్తుతం సూపర్ స్టార్ రజనీకాంత్ నెల్సన్ దిలీప్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న జైలర్ అనే సినిమాలో చేస్తున్నాడు. ఇక తర్వాత సినిమా బింబిసారా  దర్శకుడితో చేసేందుకు సిద్ధమవుతున్నాడు అన్న టాక్ కూడా ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: