26 ఏళ్ల అమ్మాయితో రొమాన్స్ కు సిద్ధమైన నాగార్జున..!!

Divya
అక్కినేని నాగేశ్వరరావు తనకంటే చిన్న వయసు ఉన్న హీరోయిన్లతో నటించడం జరిగింది.. శ్రీదేవి, జయప్రద వంటి జనరేషన్ నటి మనులు సైతం వెటర్నర్ స్టార్ సరసన నటించి ఔరా అనిపించారు.. ఆ తర్వాత అదే వారసత్వాన్ని నాగార్జున కూడా అనుసరిస్తూ ఉన్నారు.. సూపర్ వంటి సినిమాలు తనకంటే చిన్న ఏజ్ ఉన్న హీరోయిన్ అనుష్కతో నటించిన నాగార్జున కెరీర్లు ఎంతోమంది హీరోయిన్లతో నటించారు. అలా సుస్మితసేన్, ఐశ్వర్య రాయ్ వంటి మాజీ మిస్ యూనివర్సిటీలతో కూడా నటించిన ఘనత నాగార్జునకు చెందింది..

ఇదంతా ఒక ఎత్తు అయితే ఇప్పుడు నాగార్జున 63 ఏళ్ల వయసులో కూడా 26 ఏళ్ల వయసు అమ్మాయి తో నటించడం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారుతున్నది.. 60 ప్లస్ లో కూడా పాతికప్రాయం మగువలతో నాగార్జున రొమాన్స్ చేయడం  నాగార్జున ప్రత్యేకత అని నిరూపణ కానుంది. ఇక 2020 ఫేమస్ మిస్ ఇండియా కైవసం చేసుకున్న మిస్ వరల్డ్ 2021 లో భారతదేశానికి ప్రాధాన్యత వహించిన విజేత మానస వారణాసి నాగార్జున సరసన తదుపరి చిత్రంలో నటించబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
ఇందులో నాగార్జున డ్యూయల్ రోల్ పాత్రలో నటిస్తున్నట్లు సమాచారం. చిన్నప్పటి నాగార్జున పెద్ద పటి నాగ్ ఇలా వయసు వేరియేషన్స్ తో తన పాత్రలో కనిపించబోతున్నట్లు సమాచారం. నాగార్జున ఎలాంటి పాత్రలో నైనా సరే రొమాంటిక్గా నటిస్తూ ఉంటారని చెప్పవచ్చు.ఈ పాత్రలో జోడిగా మానస కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. ఇక ధమాకా సినిమా రచయిత బెజవాడ ప్రసన్నకుమార్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తూ ఉన్నారు. ఈ నెలలోని ఈ క్రేజీ సినిమా ప్రారంభం కాబోతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం నాగార్జునకు సంబంధించి ఈ విషయం మాత్రం తెగ వైరల్ గా మారుతోంది.. నాగార్జున గత సినిమాలన్నీ ఫ్లాప్ గా మిగిలాయి. మరి ఈ సినిమాతో నైనా సక్సెస్ అవుతారేమో చూడాలి మరి..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: