దసరా: అక్కడ తగ్గినా ఇక్కడ మాత్రం తగ్గేదేలె?

Purushottham Vinay
టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో న్యాచురల్ స్టార్  నాని హీరోగా కీర్తి సురేష్ హీరోయిన్ గా శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో తెరకెక్కిన పాన్ ఇండియా సినిమా 'దసరా'. 'శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్' బ్యానర్ పై సుధాకర్ చెరుకూరి నిర్మించిన ఈ సినిమా  మార్చి 30 వ తేదీన తెలుగుతో పాటు తమిళ, హిందీ, మలయాళం ఇంకా అలాగే కన్నడ భాషల్లో చాలా గ్రాండ్ గా రిలీజ్ అయ్యింది.పాన్ ఇండియా లెవెల్ లో అన్నీ ప్రాంతీయ బాషలలో ఈ సినిమా విడుదలైంది. అయితే తెలుగు లో మాత్రం ఒక రేంజిలో భారీ బ్లాక్ బస్టర్ హిట్ గా నిల్చిన ఈ సినిమా హిందీ , తమిళం , మలయాళం ఇంకా కన్నడ బాషలలో మాత్రం డిజాస్టర్ గా మిగిలిందనే చెప్పాలి . ఇక ఈ నాలుగు భాషలకు కలిపి వచ్చిన వసూళ్లు చూస్తే తెలుగులో బాగానే వచ్చినా మిగిలిన భాషలలో మాత్రం నష్టాలు తప్పలేదు.ఇక ట్రేడ్ వర్గాల నుంచి తెలుస్తున్న సమాచారం ప్రకారం మిగిలిన భాషల్లో ఈ సినిమాకి నాలుగు రోజుల్లో కనీసం రెండు కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు కూడా రాలేదని సమాచారం తెలుస్తుంది.


ఈ మూవీ టీం మొత్తం ఇతర బాషలలో ప్రత్యేకమైన ప్రొమోషన్స్ చేసారు.నాని అయితే రీసెంట్ పాన్ ఇండియన్ బ్లాక్ బస్టర్ కాంతారా రేంజ్ లో బాక్స్ ఆఫీస్ వద్ద అద్భుతాలు సృష్టిస్తుందని బలమైన నమ్మకం తో వున్నాడు. అందువల్ల సినిమాకి సంబంధించిన ప్రతీ ప్రమోషన్ ఈవెంట్ లోను నాని ఈ విషయాన్ని చెప్పుకొచ్చాడు. ట్రైలర్ ఇంకా టీజర్ కూడా పాన్ ఇండియన్ ఆడియన్స్ అందరిని ఆకర్షించే విధంగానే కట్ చేయించాడు.అయితే పర భాషలో ఈ సినిమా తగ్గిన తెలుగు భాషలో మాత్రం తగ్గేదే లె అంటూ దూసుకుపోతుంది. తెలుగులో స్టార్ హీరోల సినిమాల రేంజ్ లో ఈ సినిమాకి వసూళ్లు వస్తున్నాయి. పైగా మహేష్ బాబు, ప్రభాస్ లాంటి టాలీవుడ్ బిగ్గెస్ట్ హీరోలు కూడా ఈ సినిమాకి ఫిదా అయ్యి స్పందించడంతో ఈ సినిమాకి వసూళ్లు ఇంకా ఎక్కువ పెరుగుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: