రావణాసుర: మాస్ రాజాకి మరో హిట్ పక్కా అట?

Purushottham Vinay
రీసెంట్ గా ధమాకా సినిమాతో సూపర్ హిట్ అందుకున్న మాస్ మహరాజ రవితేజ మరో వారంలో రావణాసుర సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. అభిషేక్ పిక్చర్స్ రవితేజ టీం వర్క్ కలిసి నిర్మించిన ఈ సినిమాలో ఫరియా అబ్దుల్లా,  అను ఇమ్మాన్యుయెల్ ఇంకా అలాగే మేఘా ఆకాష్ హీరోయిన్స్ గా నటించారు.ఏప్రిల్ 7 వ తేదీన రిలీజ్ కాబోతున్న ఈ సినిమా ట్రైలర్ ను రీసెంట్ గా రిలీజ్ చేశారు.ఇక ఈ ట్రైలర్ చూస్తే రవితేజ మార్క్ మాస్ ఎంటర్టైనర్ గా మాస్ ఆడియన్స్ కు మరోసారి ఫుల్ మీల్స్ ఇచ్చేలా ఉంది ఈ సినిమా.రావణాసుర సినిమాపై రవితేజ చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారని సమాచారం తెలుస్తుంది.  ఎందుకు అంటే సుధీర్ వర్మ కథ చెప్పినప్పుడే సినిమా వర్క్ అవుట్ అవుతుందని రవితేజ అనుకున్నారట. అందుకే రవితేజ ఈ సినిమా నిర్మాణంలో కూడా భాగం  అయ్యారు. ఇక సినిమా ట్రైలర్ చూశాక సినిమా పక్కా అనుకున్న టార్గెట్ రీచ్ అవుతుందని అనిపిస్తుంది.


తన సినిమా రిలీజ్ ముందే సినిమా అవుట్ పుట్ చూసి హిట్టా కాదా అని పక్కా తేల్చేసే రవితేజ రావణాసుర సినిమా విషయంలో అయితే చాలా నమ్మకంగా ఉన్నారట. అందుకే సినిమాను ఖచ్చితంగా చాలా భారీగా ప్రమోట్ చేయాలని ఫిక్స్ అయ్యారు.టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ డైరెక్టర్ అయిన సుధీర్ వర్మ రవితేజతో చేసిన ఈ రావణాసుర సినిమా ట్రైలర్ లో కథ పెద్దగా రివీల్ చేయకపోయినా సినిమా మాత్రం మాస్ ఆడియన్స్ కు ఖచ్చితంగా మంచి ఎంటర్టైన్మెంట్ అందిస్తుందని సమాచారం.ఇక ధమాకా హిట్ జోరులో రావణాసుర సినిమాతో కూడా మరో సూపర్ హిట్ ని తన ఖాతాలో వేసుకోవాలని చూస్తున్నాడు మాస్ రాజా రవితేజ.ఇంకా ఈ సినిమా తర్వాత రవితేజ టైగర్ నాగేశ్వర రావు అనే మరో పాన్ ఇండియా సినిమా చేస్తున్నాడు. పాన్ ఇండియా లెవల్లో రాబోతున్న ఈ సినిమాలో రవితేజ ఇంతవరకు ఎప్పుడూ కనిపించని విధంగా క్రేజీ లుక్స్ తో కనిపిస్తారని సమాచారం తెలుస్తుంది. రావణాసుర సినిమా తర్వాత టైగర్ నాగేశ్వర్ రావునే ఫ్యాన్స్ ముందుకు తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు మాస్ రాజా రవితేజ.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: