"ఎన్బికె108" మూవీని ఆ తేదీన విడుదల చేసే ఆలోచనలో మేకర్స్ ఉన్నారా..?

Pulgam Srinivas
నందమూరి నట సింహం బాలకృష్ణ గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఇప్పటికే బాలకృష్ణ ఎన్నో బ్లాక్ బాస్టర్ మూవీ లలో హీరో గా నటించి టాలీవుడ్ ఇండస్ట్రీ లో సూపర్ క్రేజ్ ఉన్న హీరో గా కెరియర్ ను కొనసాగిస్తున్నాడు. ఇది ఇలా ఉంటే ఇప్పటికే ఈ సంవత్సరం బాలకృష్ణ "వీర సింహా రెడ్డి" అనే మూవీ తో పవర్ ఫుల్ విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర సొంతం చేసుకున్నాడు.

ఇలా ఇప్పటికే ఈ సంవత్సరం వీర సింహా రెడ్డి మూవీ తో మంచి విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకున్న బాలకృష్ణ ప్రస్తుతం అనిల్ రావిపూడి దర్శకత్వంలో కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా రూపొందుతున్న మూవీ లో హీరో గా నటిస్తున్నాడు. ఈ మూవీ షూటింగ్ "ఎన్ బి కే 108" అనే వర్కింగ్ టైటిల్ తో ప్రస్తుతం జరుగుతుంది. ఈ మూవీ బాలకృష్ణ కెరియర్ లో 108 వ మూవీ గా రూపొందుతుంది. ఈ సినిమాలో శ్రీ లీల ఒక కీలకమైన పాత్రలో కనిపించబోతుంది.

తమన్ ఈ మూవీ కి సంగీతం అందిస్తున్నాడు. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ మూవీ యూనిట్ ఈ సినిమాను ఈ సంవత్సరం దసరా పండుగ సందర్భంగా విడుదల చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించింది. కాకపోతే ఈ మూవీ విడుదల తేదీని మాత్రం ఈ చిత్ర బృందం అధికారికంగా ప్రకటించ లేదు. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం ఈ మూవీ విడుదలకు సంబంధించిన ఒక వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. అసలు విషయం లోకి వెళితే ... ఈ మూవీ ని ఈ సంవత్సరం దసరా పండుగ సందర్భంగా అక్టోబర్ 21 వ తేదీన విడుదల చేసే ఆలోచనలో మేకర్స్ ఉన్నట్లు ఒక వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఈ వార్తకు సంబంధించి ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన వెలబడ లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: