24 గంటల్లో అత్యధిక వ్యూస్ ను సాధించిన మూవీ ట్రైలర్లు ఇవే..!

Pulgam Srinivas
ప్రతి సంవత్సరం ఎన్నో మూవీ లు విడుదల అవుతూ ఉంటాయి. అలాగే ఆ సినిమాలకు సంబంధించిన ట్రైలర్ లు కూడా విడుదల అవుతూ ఉంటాయి. అలా విడుదల అయిన సినిమా ట్రైలర్ లలో కొన్ని మూవీ ల ట్రైలర్ లపై ప్రేక్షకులు భారీ అంచనాలను కలిగి ఉంటారు. అలా ప్రేక్షకుల్లో భారీ అంచనాలు కలిగి ఉన్న ట్రైలర్ లకు విడుదలైన తక్కువ సమయం లోనే భారీ వ్యూస్ లభిస్తూ ఉంటాయి. ఇది ఇలా ఉంటే తెలుగు సినిమా ఇండస్ట్రీ నుండి విడుదల అయిన సినిమా ట్రైలర్ లలో 24 గంటల్లో అత్యధిక వ్యూస్ ను సాధించిన టాప్ 5 ట్రైలర్ లు ఏవో ప్రస్తుతం తెలుసుకుందాం.

గీతా గోవిందం మూవీ తో మంచి గుర్తింపుని తెచ్చుకున్న పరశురామ్ కొంత కాలం క్రితం మహేష్ బాబు తో సర్కారు వారి పాట అనే మూవీ ని తెరకెక్కించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ ట్రైలర్ విడుదల అయిన 24 గంటల్లో 26.77 మిలియన్ వ్యూస్ ను సాధించింది. ప్రభాస్ హీరోగా రాధాకృష్ణ దర్శకత్వంలో పూజా హెగ్డే హీరోయిన్ గా రూపొందిన రాధే శ్యామ్ మూవీ ట్రైలర్ విడుదల అయిన 24 గంటల టైం లో 23.20 మిలియన్ వ్యూస్ ను సాధించి రెండవ స్థానంలో నిలిచింది.

కొరటాల శివ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి హీరోగా రూపొందిన ఆచార్య మూవీ ట్రైలర్ విడుదలైన 24 గంటల్లో 21.86 మిలియన్ న్యూస్ ను సాధించి మూడవ స్థానంలో నిలిచింది. ప్రభాస్ హీరోగా అనుష్క , తమన్నా హీరోయిన్ లుగా రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన బాహుబలి 2 మూవీ ట్రైలర్ 24 గంటల సమయంలో 21.81 మిలియన్ న్యూస్ ను సాధించి నాలుగవ స్థానంలో నిలిచింది. రామ్ చరణ్ , జూనియర్ ఎన్టీఆర్ హీరోలుగా రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన ఆర్ ఆర్ ఆర్ మూవీ ట్రైలర్ 24 గంటల సమయంలో 20.45 మిలియన్ న్యూస్ ను సాధించింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: