రవితేజ "రావణాసుర" ట్రైలర్ కు 24 గంటల్లో వచ్చిన రెస్పాన్స్ ఇదే..!

Pulgam Srinivas
మాస్ మహారాజ రవితేజ పోయిన సంవత్సరం త్రినాధ్ రావు నక్కిన దర్శకత్వంలో శ్రీ లీల హీరోయిన్ గా రూపొందిన ధమాకా మూవీ తో అదిరిపోయే మాస్ బ్లాక్ బస్టర్ విజయాన్ని  బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకున్నాడు. ఇది ఇలా ఉంటే ఈ సంవత్సరం చిరంజీవి హీరో గా రూపొందిన వాల్తేరు వీరయ్య మూవీ లో ఒక కీలకమైన పాత్రలో నటించి ఈ మూవీ తో కూడా మంచి విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర సొంతం చేసుకున్నాడు.

ఇలా వరుస విజయాలతో ఫుల్ జోష్ లో ఉన్న రవితేజ తాజాగా రావణాసుర అనే మూవీ లో హీరో గా నటించాడు. సుధీర్ వర్మ దర్శకత్వం వహించిన ఈ మూవీ లో సుశాంత్ ఒక కీలకమైన పాత్రలో నటించగా ... అను ఇమాన్యుయల్ , మేఘ ఆకాష్ , ఫరియా అబ్దుల్లా , పూజిత పొన్నాడ , దక్ష నాగర్కర్ ముఖ్య పాత్రలలో నటించారు. ఈ మూవీ ని ఏప్రిల్ 7 వ తేదీన థియేటర్ లలో విడుదల చేయనున్నారు. ఈ మూవీ విడుదల తేదీ దగ్గర పడడంతో తాజాగా ఈ సినిమా బృందం ఈ మూవీ నుండి ట్రైలర్ ను విడుదల చేసింది. ఈ మూవీ టీజర్ ప్రేక్షకులను బాగా ఆకట్టు కోవడంతో ఈ మూవీ ట్రైలర్ పై ప్రేక్షకులు మంచి అంచనాలు పెట్టుకున్నారు.

అలా మంచి అంచనాల నడుమ విడుదల అయిన ఈ మూవీ ట్రైలర్ విడుదల 24 గంటల్లో ప్రేక్షకుల నుండి సూపర్ రెస్పాన్స్ ను తెచ్చుకుంది. ఈ మూవీ ట్రైలర్ విడుదల 24 గంటల్లో 7.59 మిలియన్ వ్యూస్ ను ... 130.1 కే లైక్ లను సాధించింది.  ఓవరాల్ గా చూసుకుంటే రావణాసుర మూవీ ట్రైలర్ కు ప్రేక్షకుల నుండి సూపర్ రెస్పాన్స్ లభించింది అని చెప్పవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: