రవితేజ లైనప్ మాములుగా లేదుగా...!!

murali krishna
మాస్ రాజా రవితేజ  వరుసగా సినిమాలు ఒప్పుకుంటున్నాడు.. ధమాకా సినిమా తో ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చి భారీ విజయాన్ని సొంతం చేసుకున్న సంగతి తెల్సిందే.

వచ్చే నెల లో రావణాసుర సినిమా తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడటా.అంతే కాకుండా టైగర్ నాగేశ్వరరావు  సినిమా కూడా తరువాత లైన్ లో ఉంది. ఇదే ఏడాది ఆ సినిమా కూడా విడుదల అవ్వాల్సి ఉందటా.. ఇన్ని సినిమాలు చేస్తున్న రవితేజ మరో వైపు ఇటీవలే వీరు పోట్ల దర్శకత్వంలో ఒక సినిమా ను చేయబోతున్న సంగతి తెల్సిందే. మరో వైపు రవితేజ రెండు సినిమాలు కూడా కమిట్ అయ్యాడనే వార్తలు కూడా వస్తున్నాయి. ఇన్ని సినిమాలు ఈ మధ్య కాలంలో రవితేజ చేయలేదు.. ఇంత స్పీడ్ గా సినిమా లు పదేళ్ల క్రితం రవితేజ చేసేవాడటా.. అందు లో చాలా సినిమాలు కూడా ఫెయిల్ అయ్యేవి. దాంతో మెల్ల మెల్లగా సినిమా ల సంఖ్యను కూడా తగ్గించాడు.
 రవితేజ పనైపోయింది అంటూ కొందరు చెప్పుకొచ్చారు.కానీ ఇప్పటికి కూడా రవితేజ జోరు అలాగే కంటిన్యూ అవుతూనే ఉంది. హీరో గా రవితేజ చాలా బిజీ గా ఉన్నాడు. ఏడాది కి నాలుగు అయిదు సినిమాలు విడుదల చేయాలనే లా ఉన్నాడు. అందుకే వరుసగా సినిమాల కు కమిట్ అవుతున్నట్లు గా సమాచారం. ఇన్ని సినిమాలు చేస్తున్న రవితేజ జోరు చూస్తూ ఉంటే ఆశ్చర్యంగా ఉందంటూ కొందరు వారి అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. సోషల్ మీడియా లో రవితేజ కి ఉన్న క్రేజ్ ఏంటో ఇప్పటికే అందరికి అర్థం అయింది. మరో అయిదు ఆరు సంవత్సరాల పాటు ఆయన సినిమాలు బ్యాక్ టు బ్యాక్ భారీ గా రాబోతున్నాయటా.. ఆ సినిమాలు కూడా రవితేజ తన ఎనర్జీ తో కంప్లీట్ చేస్తాడు.రవితేజ వరుసగా క్రేజీ సబ్జెక్టు లను ఎంచుకుంటున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: