"ఎన్బికె 108" లీకైన బాలకృష్ణ స్టైలిష్ లుక్ ఫోటో..!

Pulgam Srinivas
నందమూరి నట సింహం బాలకృష్ణ ప్రస్తుతం అదిరిపోయే రేంజ్ విజయాలను బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకుంటూ అద్భుతమైన జోష్ లో కెరీర్ ను ముందుకు సాగిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. కొంత కాలం క్రితమే బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందిన అఖండ మూవీ తో అద్భుతమైన విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర సొంతం చేసుకున్న బాలయ్య ఈ సంవత్సరం సంక్రాంతి కానుకగా జనవరి 12 వ తేదీన విడుదల అయిన వీర సింహా రెడ్డి మూవీ తో మరో విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర సొంతం చేసుకున్నాడు.
 

ఈ మూవీ కి గోపీచంద్ మరినేని దర్శకత్వం వహించగా ... శృతి హాసన్ ఈ సినిమాలో హీరోయిన్ గా నటించింది. ఇలా వరుస విజయాలతో మంచి జోష్ లో కెరియర్ ను ముందుకు సాగిస్తున్న బాలకృష్ణ ప్రస్తుతం అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందుతున్న మూవీ లో హీరో గా నటిస్తున్నాడు. కాజల్ అగర్వాల్ ఈ మూవీ లో బాలకృష్ణ సరసన హీరోయిన్ గా నటిస్తూ ఉండగా ... తమన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు. శ్రీ లీల ఈ మూవీ లో ఒక కీలక పాత్రలో నటిస్తోంది. కొన్ని రోజుల క్రితమే ఈ సినిమా నుండి బాలకృష్ణ కు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ ను ఈ చిత్ర బృందం విడుదల చేసింది.

ఈ మూవీ నుండి చిత్ర బృందం విడుదల చేసిన బాలకృష్ణ ఫస్ట్ లుక్ పోస్టర్ కు ప్రేక్షకుల నుండి అద్భుతమైన రెస్పాన్స్ లభించింది. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ మూవీ నుండి బాలకృష్ణ కు సంబంధించిన ఒక స్టైలిష్ లుక్ లో ఉన్న ఫోటో బయటకు వచ్చింది. ప్రస్తుతం ఈ మూవీ లోని బాలకృష్ణ కు సంబంధించి బయటకు వచ్చిన ఈ ఫోటో సోషల్ మీడియాలో అదిరిపోయే రేంజ్ లో వైరల్ అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: