లగ్జరియస్ కారును కొనుగోలు చేసిన షారుక్..!

Pulgam Srinivas
బాలీవుడ్ టాప్ హీరోలలో ఒకరు అయినటు వంటి షారుక్ ఖాన్ తాజాగా పఠాన్ మూవీ తో అదిరిపోయే రేంజ్ భారీ బ్లాక్ బస్టర్ విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకున్న విషయం అందరికీ తెలిసిందే. ఈ మూవీ భారీ అంచనాల నడుమ విడుదల అయ్యి బాక్స్ ఆఫీస్ దగ్గర 1000 కోట్ల కు పైగా కలెక్షన్ లను వసూలు చేసి అద్భుతమైన విజయాన్ని అందుకుంది. కొంత కాలం పాటు సరైన విజయం లేని షారుఖ్ ఈ మూవీ విజయంతో ఫుల్ ఫామ్ లోకి వచ్చేసాడు.

ఈ మూవీ కి సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వం వహించగా ... దీపికా పదుకొనే ఈ మూవీ లో షారుక్ సరసన హీరోయిన్ గా నటించింది. జాన్ అబ్రహం ఈ మూవీ లో విలన్ పాత్రలో నటించాడు. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం షారుక్ తమిళ క్రేజీ దర్శకుడు అట్లీ దర్శకత్వంలో రూపొందుతున్న జవాన్ అనే మూవీ లో హీరో గా నటిస్తున్నాడు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ ఫుల్ స్పీడ్ లో జరుగుతుంది. ఈ మూవీ పై అటు హిందీ ... ఇటు తమిళ్ సినీ ప్రేమికుల భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం పఠాన్ మూవీ సక్సెస్ తో ఫుల్ జోష్ లో ఉన్న షారుఖ్ తాజాగా ఒక లగ్జరియస్ కారును కొనుగోలు చేశాడు.

షారుక్ తాజాగా భారీ ధర కలిగిన రోల్స్ రాయిస్ కారును కొనుగోలు చేసినట్లు తెలుస్తుంది. చాలా విలాసవంతమైన "ఎస్ యు వి" లలో ఒకటి అయినటువంటి రోల్స్ రాయిస్ కల్గినన్ బ్లాక్ బ్యాడ్జ్ మోడల్ ధర రూ 8.20 కోట్లు ఉండగా  ... ఎక్స్ షో రూమ్ ధర దాదాపు 10 కోట్ల వరకు ఉండబోతున్నట్లు తెలుస్తుంది. ఇలా భారీ ధర కలిగిన ఈ లగ్జరీయస్ కారును తాజాగా షారుఖ్ ఖాన్ కొనుగోలు చేసినట్లు తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: