ఆ రెండు టైటిల్స్ పై అసంతృప్తిగా ఉండడంతోనే మహేష్ 28 మూవీ నుండి ఆ అప్డేట్ రాలేదా..?

Pulgam Srinivas
సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం వరుస విజయాలను బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకుంటూ అదిరిపోయే రేంజ్ జోష్ లో కెరియర్ ను ముందుకు సాగిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఇది ఇలా ఉంటే పోయిన సంవత్సరం సర్కారు వారి పాట మూవీ తో కూడా మహేష్ అద్భుతమైన విజయాన్ని అందుకున్నాడు. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ లో రూపొందుతున్న మూవీ లో మహేష్ హీరో గా నటిస్తున్నాడు.

ఈ మూవీ మహేష్ కెరియర్ లో 28 వ మూవీ గా రూపొందుతుంది. ఇది ఇలా ఉంటే ఇప్పటి వరకు ఈ చిత్ర బృందం ఈ సినిమాకు టైటిల్ ను ఫిక్స్ చేయలేదు. ఈ సంవత్సరం ఉగాది సందర్భంగా ఈ మూవీ యూనిట్ ఈ సినిమా టైటిల్ ను విడుదల చేసే అవకాశాలు ఉన్నట్లు అనేక వార్తలు వచ్చాయి. అలాగే అందు కోసం మూవీ యూనిట్ కూడా ప్రయత్నాలు చేసినట్లు తెలుస్తోంది. ఈ మూవీ కోసం ఈ సినిమా బృందం "అమరావతికి అటు ఇటు" మరియు "గుంటూరు కారం" అనే రెండు టైటిల్ లను చివరి దశ వరకు పరిశీలించిందట ... కాకపోతే ఈ రెండు టైటిల్ ల విషయంలో కూడా ఈ మూవీ యూనిట్ అసంతృప్తిగా ఉండడంతో చివరగా ఉగాది సందర్భంగా ఈ సినిమా టైటిల్ ను ఈ మూవీ యూనిట్ విడుదల చేయాలేదని తెలుస్తుంది.

ఇది ఇలా ఉంటే ఈ మూవీ లో పూజ హెగ్డే ..m శ్రీ లీల హీరోయిన్ లుగా కనిపించనుండగా ... తమన్ ఈ మూవీ కి సంగీతం అందిస్తున్నాడు. ఈ మూవీ.ని వచ్చే సంవత్సరం జనవరి 13 వ తేదీన విడుదల చేయనున్నట్లు ఈ మూవీ యూనిట్ కొన్ని రోజుల క్రితమే అధికారికంగా ప్రకటించింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: