అజయ్ దేవగన్ "భోళా" మూవీ రన్ టైమ్ లాక్..!

Pulgam Srinivas
బాలీవుడ్ ఇండస్ట్రీ లో సూపర్ క్రేజ్ ఉన్న హీరోలలో ఒకరు అయినటు వంటి అజయ్ దేవగన్ గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ హీరో ఇప్పటికే ఎన్నో మూవీ లలో నటించి బాలీవుడ్ ఇండస్ట్రీ లో తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పరచుకున్నాడు. ఇది ఇలా ఉంటే కొంత కాలం క్రితమే ఈ నటుడు దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ .. యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ హీరోలుగా రూపొందిన భారీ బడ్జెట్ పాన్ ఇండియా మూవీ "ఆర్ ఆర్ ఆర్" లో ఒక కీలకమైన పాత్రలో నటించాడు.

ఈ మూవీ లో అజయ్ దేవగన్ పాత్ర నిడివి తక్కువే ఆయనప్పటికీ తన పాత్రతో ఎంతో మంది ప్రేక్షకుల మనసులను అజయ్ దోచుకున్నాడు. ఇది ఇలా ఉంటే తాజాగా అజయ్ దేవగన్ "భోళా" అనే మూవీ లో హీరో గా నటించాడు. ఈ మూవీ లో అజయ్ దేవగన్ హీరోగా నటించడం మాత్రమే కాకుండా ఈ మూవీ కి దర్శకత్వం కూడా వహించాడు. ఈ మూవీ ని మార్చి 30 వ తేదీన థియేటర్ లలో విడుదల చేయనున్నారు. ఈ మూవీ విడుదల తేదీ దగ్గర పడటంతో తాజాగా ఈ సినిమా బృందం ఈ మూవీ సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసింది.

ఈ మూవీ కి సెన్సార్ బోర్డు నుండి యూ / ఏ సర్టిఫికెట్ లభించింది. తాజాగా ఈ మూవీ యూనిట్ ఈ సినిమా రన్ టైమ్ ని కూడా లాక్ చేసింది  ఈ సినిమా 144 నిమిషాలు (2 గంటల 24 నిమిషాల) నిడివితో ప్రేక్షకుల ముందుకు రానుంది. మరి ఈ మూవీ ఏ రేంజ్ విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర సొంతం చేసుకుంటుందో తెలియాలి అంటే మరి కొన్ని రోజులు వేచి చూడాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: