ప్రభాస్ అభిమానులలో అంతర్మధనం !

Seetha Sailaja
‘బాహుబలి’ తరువాత ప్రభాస్ పాన్ ఇండియా హీరోగా మారిపోయాడు. అతడి పారితోషికం కూడ 100 కోట్ల స్థాయికి చేరుకుంది. అయితే గత రెండు సంవత్సరాల కాలంలో టాలీవుడ్ ఫిలిం ఇండస్ట్రీలో అనేక మార్పులు వచ్చాయి. ప్రభాస్ తో పాటు పోటీగా అల్లు అర్జున్ జూనియర్ రామ్ చరణ్ లు పాన్ ఇండియా హీరోలుగా మారిపోయారు.

ఆఖరికి విజయ్ దేవరకొండ నాని నిఖిల్ లు కూడ తమ సినిమాలను పాన్ ఇండియా సినిమాలుగా మార్చి విడుదల చేస్తునారు. టాలీవుడ్ హీరోలు చాలామంది పాన్ ఇండియా హీరోలుగా మారిపోవడంతో ప్రభాస్ పాన్ ఇండియా స్థాయికి ఇప్పుడు గట్టి పోటీ ఏర్పడింది అన్న అభిప్రాయంలో అతడి అభిమానులు టెన్షన్ పడుతున్నట్లు వార్తలు వస్తున్నాయి.

దీనికితోడు టాప్ హీరోలు చాలామంది మంచి పిఆర్ టీమ్ లను పెట్టుకుని తమకు తాము బాలీవుడ్ లో విపరీతంగా ప్రమోట్ చేసుకుంటున్నారు. ఈవిషయంలో ప్రభాస్ పిఆర్ టీమ్ బాగా వెనకడుగులో ఉందని అతడి అభిమానుల అభిప్రాయం అని తెలుస్తోంది. అంతేకాకుండా టాప్ హీరోలు తమ అభిమానులతో బాగా టచ్ లో ఉంటూ తమ సినిమాలకు సంబంధించిన అప్ డేట్స్ ను అభిమానులకు తెలియచేస్తూ వారి ఇమేజ్ ని పెంచుకుంటుంటే ఈవిషయంలో ప్రభాస్ చాల వెనకడుగు వేస్తున్నాడని అతడి అభిమానుల అంతర్మధనం.

ప్రభాస్ ప్రస్తుతం నాలుగు భారీ సినిమాలలో నటిస్తున్నాడు. ‘ఆదిపురుష్’ ‘సలార్’ ‘ప్రాజెక్ట్ కె’ మారుతి కాంబినేషన్ లో చేస్తున్న మూవీలకు సంబంధించిన ఏ లేటెస్ట్ న్యూస్ లు ప్రభాస్ అభిమానుల వరకు చేరడంలేదు. కనీసం గడిచిన ఉగాదికి ఈ నాలుగు సినిమాలలో ఎదో ఒక సినిమాకు సంబంధించిన టీజర్ కానీ లేదంటే ట్రైలర్ కానీ వస్తుందని అభిమానులు ఆశించారు. అయితే ఎటువంటి అప్ డేట్ లేకపోవడంతో టాలీవుడ్ టాప్ హీరోల పాన్ ఇండియా రేస్ లో ప్రభాస్ సరైన ప్లానింగ్ తో అడుగులు వేయడంలేదు అన్న అభిప్రాయంలో అభిమానులు ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి..


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: