బ్లాక్ కలర్ శారీలో మెరిసిపోతున్న దీపిక..!

Pulgam Srinivas
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ లలో ఒకరు అయినటువంటి దీపిక పదుకొనె గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఇప్పటికే దీపిక ఎన్నో బ్లాక్ బాస్టర్ మూవీ లలో నటించి ప్రపంచ వ్యాప్తంగా నటిగా తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును సంపాదించుకుంది. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ ముద్దుగుమ్మ పఠాన్ మూవీతో అద్భుతమైన విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకుంది. ఈ మూవీ లో షారుక్ హీరోగా నటించగా టాలెంట్ డ్ డైరెక్టర్ సిద్ధార్థ్ ఆనంద్ ఈ మూవీ కి దర్శకత్వం వహించాడు. దీపికా ప్రస్తుతం నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా రూపొందుతున్న ప్రాజెక్టు కే అనే భారీ బడ్జెట్ పాన్ వరల్డ్ మూవీ లో కథానాయకగా నటిస్తోంది.

ఈ మూవీ తో దీపిక తెలుగు సినిమా ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇవ్వబోతుంది. ఈ మూవీ పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. ఇది ఇలా ఉంటే సినిమాల్లో అందచందాలను ఆరబోయడానికి ఏ మాత్రం వెనకడుగు వేయకుండా ఇప్పటికే ఎన్నో సినిమాల్లో తన హాట్ హాట్ అందచందాలను ఆరబోసి వెండి తెరపై సెగలు పుట్టించిన ఈ హాట్ బ్యూటీ సోషల్ మీడియాలో కూడా అదే రేంజ్ లో అందచందాలను ఆరబోస్తూ వస్తుంది. అలాగే ఈ ముద్దుగుమ్మకు సంబంధించిన అనేక హాట్ లుక్ లో ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అయిన సందర్భాలు కూడా అనేకం ఉన్నాయి.

ఇది ఇలా ఉంటే తాజాగా దీపిక తన సోషల్ మీడియా అకౌంట్ లో కొన్ని ఫోటోలను పోస్ట్ చేసింది. ఈ ఫోటోలలో దీపిక బ్లాక్ కలర్ లో ఉన్న శారీని కట్టుకొని అందుకు తగిన బ్లాక్ కలర్ లో ఉన్న బ్లౌజ్ ను ధరించి చాలా క్లాస్ అండ్ డీసెంట్ లుక్ లో ఫోటోలకు స్టిల్స్ ఇచ్చింది. ప్రస్తుతం దీపికా కు సంబంధించిన ఈ వేరి క్లాస్ అండ్ డీసెంట్ లుక్ లో ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: