దసరాకి ఆ ఇద్దరు స్టార్ హీరోలు బాక్స్ ఆఫీస్ దగ్గర తలపడనున్నారా..?

Pulgam Srinivas
దసరా పండుగ వచ్చింది అంటే టాలీవుడ్ బాక్సా ఫీస్ దగ్గర పండగ వాతావరణం కనిపిస్తూ ఉంటుంది. ఎక్కువ శాతం దసరా పండక్కి స్టార్ హీరోలు నటించిన సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర విడుదల అవుతూ ఉంటాయి. అలాగే ఈ సంవత్సరం సంక్రాంతి కి కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర స్టార్ హీరోలు నటించిన సినిమాలు సందడి చేసే అవకాశాలు చాలా వరకు కనిపిస్తున్నాయి. ఇది ఇలా ఉంటే సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో రూపొందుతున్న మూవీ లో హీరో గా నటిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే.

ఈ మూవీ మహేష్ కెరియర్ లో 28 వ మూవీ గా రూపొందబోతుంది. ఈ మూవీ ని ఆగస్టు 11 వ తేదీన విడుదల చేయనున్నట్లు కొన్ని రోజుల క్రితం ఈ మూవీ నిర్మాత సూర్య దేవర నాగ వంశీ ప్రకటించాడు. కానీ ఈ తేదీన ఈ సినిమా విడుదల కావడం కష్టమే అని కొన్ని వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈ సినిమాను ఈ సంవత్సరం దసరా పండుగ సందర్భంగా విడుదల చేసే ఆలోచనలో ఈ మూవీ యూనిట్ ఉన్నట్లు ఒక వార్త వైరల్ అవుతుంది.

ఇది ఇలా ఉంటే ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ... క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో రూపొందుతున్న హరిహర వీరమల్లు అనే మూవీ లో హీరో గా నటిస్తున్న విషయం అందరికీ తెలిసిందే. ఈ మూవీ షూటింగ్ కూడా ప్రస్తుతం చివరి దశకు చేరుకుంది. ఈ సినిమాను కూడా ఈ సంవత్సరం దసరా పండుగ సందర్భంగా విడుదల చేయాలి అనే ఆలోచనలో ఈ చిత్ర బృందం ఉన్నట్లు తెలుస్తోంది. ఒక వేళ ఈ రెండు సినిమాలను కూడా దసరా పండుగ సందర్భంగా విడుదల చేసినట్లు అయితే బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ రెండు మూవీ ల మధ్య భారీ యుద్ధమే జరిగే అవకాశం ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: