ఎన్బికె 108 : లేటెస్ట్ షూటింగ్ అప్డేట్..!

Pulgam Srinivas
నందమూరి నట సింహం బాలకృష్ణ ప్రస్తుతం టాలెంటెడ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందుతున్న మూవీ లో హీరో గా నటిస్తున్నాడు. ఈ మూవీ కి చిత్ర బృంద ఇప్పటి వరకు టైటిల్ ని ఫిక్స్ చేయని నేపథ్యంలో ఈ మూవీ యొక్క షూటింగ్ ను ఈ చిత్ర బృందం ఎన్ బి కె 108 అనే వర్కింగ్ టైటిల్ తో పూర్తి చేస్తూ వస్తుంది. కొన్ని రోజుల క్రితమే ఏ సినిమా నుండి బాలకృష్ణ కు సంబంధించిన ఫస్ట్ లుక్  పోస్టర్ ను ఈ మూవీ యూనిట్ విడుదల చేసింది.

 ఈ ఫస్ట్ లుక్ పోస్టర్ లో బాలకృష్ణ అదిరిపోయే స్టైలిష్ లుక్ లో ఉండడంతో ఈ పోస్టర్ కు ప్రేక్షకుల నుండి అద్భుతమైన రెస్పాన్స్ లభించడం మాత్రమే కాకుండా ఈ సినిమాపై కూడా అంచనాలు భారీగా పెరిగిపోయాయి. ఇది ఇలా ఉంటే ఈ సినిమాలో బాలకృష్ణ సరసన కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటించినుండగా ... శ్రీ లీల ఈ మూవీ లో ఒక కీలకమైన పాత్రలో కనిపించబోతుంది. ఇది ఇలా ఉంటే ఈ మూవీ షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ లో జరుగుతున్నట్లు తెలుస్తోంది.

ప్రస్తుతం జరుగుతున్న ఈ మూవీ షెడ్యూల్ లో బాలకృష్ణ తో పాటు కాజల్ ... శ్రీ లీల కూడా పాల్గొంటున్నట్లు సమాచారం. ఈ షెడ్యూల్ లో బాలకృష్ణ మరియు కాజల్ ... శ్రీ లీల పై చిత్ర బృందం ఈ సినిమాకు సంబంధించిన కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నట్లు తెలుస్తోంది. బాలకృష్ణ ఇప్పటికే బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందిన అఖండ మూవీ తోనూ ... గోపీచంద్ మలినేని దర్శకత్వంలో రూపొందిన వీర సింహా రెడ్డి మూవీ తోను మంచి  విజయాలను బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకున్నాడు. ఇలా వరుస విజయాల తర్వాత బాలకృష్ణ నటిస్తున్న మూవీ కావడంతో అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందుతున్న మూవీ పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: