అఫీషియల్ : "ఓటిటి" లో ఆ తేదీ నుండి ఆ లేటెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీ..!

Pulgam Srinivas
ఈ మధ్య కాలంలో కొన్ని చిన్న సినిమాలు పెద్దగా బడ్జెట్ లేకుండా ... గుర్తింపు పొందిన నటీనటులు లేకుండా రూపొంది ఎలాంటి అంచనాలు లేకుండా విడుదల అయ్యి భారీ బ్లాక్ బాస్టర్ విజయాలను బాక్స్ ఆఫీస్ దగ్గర సాధిస్తున్నాయి. ఇలాంటి సినిమాలు ప్రస్తుతం ఇండియా వ్యాప్తంగా అన్ని ఇండస్ట్రీ లలో కూడా వస్తున్నాయి.

ఇది ఇలా ఉంటే కొన్ని రోజుల క్రితమే మలయాళ ఇండస్ట్రీ లో కూడా "రొమంచన్" అనే సినిమా చాలా తక్కువ బడ్జెట్ తో ... పేరున్న నటీనటులు నటించకుండా రూపొందింది. ఈ మూవీ పెద్దగా అంచనాలు లేకుండా థియేటర్ లలో విడుదల అయింది. కానీ విడుదల తర్వాత ఈ మూవీ.కి మాత్రం ప్రేక్షకుల నుండి అద్భుతమైన ప్రశంసలు లభించాయి. దానితో 2 కోట్లతో రూపొందిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఏకంగా 62 కోట్ల కలెక్షన్ లను సాధించింది. ఇలా భారీ కలెక్షన్ లను బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకున్న ఈ మూవీ భారీ బ్లాక్ బస్టర్ విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర సొంతం చేసుకుంది.

ఈ సినిమా మరికొన్ని రోజుల్లో "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లోకి ఎంట్రీ ఇవ్వబోతుంది. తాజాగా ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వెలువడింది. ఈ మూవీ యొక్క "ఓ టి టి" హక్కులను డిస్నీ ప్లేస్ హాట్ స్టార్ సంస్థ దక్కించుకుంది. అందులో భాగంగా ఈ మూవీ ని ఏప్రిల్ 7 వ తేదీ నుండి మలయాళ ,  తెలుగు , తమిళ , కన్నడ , హిందీ భాషలలో స్ట్రీమింగ్ చేయనున్నట్లు డిస్నీ ప్లస్ హాట్ స్టార్ "ఓ టి టి" సంస్థ తాజాగా ప్రకటించింది. మరి ఈ మూవీ కి "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లో ఏ రేంజ్ రెస్పాన్స్ లభిస్తుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

ott

సంబంధిత వార్తలు: