మరొకసారి సంచలన ట్విట్ చేసిన అల్లు అర్జున్ హీరోయిన్..!!

Divya
అల్లు అర్జున్ నటించిన వరుడు సినిమాతో మొదటిసారిగా తెలుగు తెరకు పరిచయమయ్యింది హీరోయిన్ భాను శ్రీ మెహ్రా. ఈ సినిమా సమయంలో ఈమెకు వచ్చిన క్రేజ్ గురించి చెప్పాల్సిన పనిలేదు అందుకు కారణం ఈమె ఫేస్ రివిల్ చేయకపోవడమే అని చెప్పవచ్చు. ఈ సినిమా విడుదలైన తర్వాత భాను శ్రీ కి తెలుగులో పెద్దగా అవకాశాలు అయితే రాలేదు.. దీంతో ఈ అమ్మడు హిందీ, తమిళ్ ,పంజాబీ వంటి చిత్రాలలో నటించింది భాను శ్రీ హీరోయిన్గా సక్సెస్ కాలేకపోవడంతో చాలా రోజులు సైలెంట్ గా ఉండిపోయింది.

అయితే ఇటీవలే తనను అల్లు అర్జున్ బ్లాక్ చేశారంటూ మళ్లీ తరచూ వార్తలు నిలిచింది. తాజాగా సినీ పరిశ్రమంలో ఉన్న ప్రధాన సమస్య ఇదే అని ఇకపైన ఈ మూస పద్ధతిని ముగింపు పలకాలంటు తెలియజేస్తోంది .ఈ అమ్మడు ప్రస్తుతం ఈమె చేసిన ట్విట్ సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారుతున్నది.. సినీ ఇండస్ట్రీలో ఉన్న ప్రధానమైన సమస్య వయసు మాత్రమే వయసు వచ్చిన స్త్రీలను పెళ్లైన మహిళలను కేవలం తల్లి, సోదరి, వదిన పాత్రలకే పరిమితం చేస్తూ ఉంటారు పురుషులకు వచ్చేసరికి అది మాత్రం వర్తించదా అంటూ తెలుపుతోంది.
వాళ్లు ఎప్పటిలాగానే ప్రధాన పాత్రలో నటిస్తూ ఉంటారు తమకంటే చిన్నవారికి ప్రేమికుడిగా నటిస్తారు.. స్త్రీల విలువ వయసు లేదా ఆమె వైవాహిక స్థితి ఆధారంగా నిర్ణయిస్తారు పాత పద్ధతికి ఇకనైనా స్వస్తి పలకండి ధైర్యవంతులు, స్వతంత్రంగా ఉన్న మహిళల కథలను చెప్పండి అన్ని వయసులో మహిళలను పరిశ్రమ ప్రోత్సహిస్తూనే ఉంటుంది. దీనిని మీరు అంగీకరిస్తారా అంటూ ప్రశ్నిస్తోంది? ప్రస్తుతం భాను శ్రీ చేసిన ఈ ట్విట్ నెటిజెన్లకు భిన్నాభిప్రాయాలను తెచ్చే విధంగా చేస్తోంది. కొంతమంది ఈ విషయాన్ని అంగీకరిస్తుంటే మరి కొంతమంది మాత్రం ఇదేమీ పెద్ద సమస్య కాదని వయసు కంటే హార్డ్ వర్క్ ముఖ్యమని వివాహం తర్వాత కూడా ఎంతోమంది హీరోయిన్స్ సినిమాలు చేస్తున్నారు మీరు కూడా చేయండి అంటూ బదులిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: