ఏజెంట్ మూవీ నుండి "ఏందే ఏందే" సాంగ్ విడుదల టైమ్ ను ప్రకటించిన చిత్ర బృందం..!

Pulgam Srinivas
అక్కినేని అఖిల్ ప్రస్తుతం ఏజెంట్ అనే మూవీ లో హీరో గా నటిస్తున్న విషయం అందరికీ తెలిసిందే. ఈ మూవీ కి సురేందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ మూవీ ని దర్శకుడు సురేందర్ రెడ్డి స్టైలిష్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ గా రూపొందిస్తున్నాడు. సైరా నరసింహా రెడ్డి లాంటి భారీ బడ్జెట్ పాన్ ఇండియా మూవీ తర్వాత సురేందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్న మూవీ కావడంతో ఈ మూవీ పై సినీ ప్రేమికుల్లో భారీ అంచనాలు ఉన్నాయి.
 

ఇది ఇలా ఉంటే ఈ మూవీ ని కూడా భారీ బడ్జెట్.తో పాన్ ఇండియా మూవీ గా రూపొందిస్తున్నారు. ఈ సినిమాను ఏప్రిల్ 28 వ తేదీన తెలుగు , తమిళ్ ,  కన్నడ , మలయాళ , హిందీ భాషలలో ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయనున్నారు. ఇది ఇలా ఉంటే ఈ మూవీ విడుదల తేదీ దగ్గర పడడంతో ఇప్పటికే ఈ సినిమా నుండి ఒక పాటను మరియు టీజర్ ను కూడా ఈ చిత్ర బృందం విడుదల చేసింది. తాజాగా ఈ మూవీ యూనిట్ ఈ సినిమా నుండి రెండవ సాంగ్ విడుదల సమయాన్ని ప్రకటించింది.

ఈ మూవీ నుండి రెండవ సాంగ్ అయినటు వంటి "ఏందే ఏందే" అనే పాటను ఈ రోజు రాత్రి 7 గంటల 02 నిమిషాలకు విడుదల చేయనున్నట్లు ఈ చిత్ర బృందం అధికారికంగా ప్రకటిస్తూ ఒక పోస్టర్ ను కూడా విడుదల చేసింది. అలాగే ఈ చిత్ర బృందం ఈ పాటకు చంద్రబోస్ లిరిసిస్ట్ గా వివరించినట్లు ... ఈ పాటకు హిప్ హాప్ తమిజా సంగీతాన్ని అందించినట్టు ... సంజిత్ హెగ్డే ... పద్మలత ఈ పాటను పాడినట్లు ఈ చిత్ర బృందం ఈ పోస్టర్ ద్వారా తెలియజేసింది. మరి ఏజెంట్ మూవీ లోని "ఏందే ఏందే" సాంగ్ ప్రేక్షకులను ఏ మేరకు అలరిస్తుందో చూడాలి అంటే మరి కొంత సమయం వేచి చూడాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: