1వసారి తో పోలిస్తే 2వసారి అమాంతం పడిపోయిన ఆచార్య "టిఆర్పి" రేటింగ్..!

Pulgam Srinivas
మెగాస్టార్ చిరంజీవి పోయిన సంవత్సరం మొదటగా ఆచార్య అనే మూవీతో ప్రేక్షకులను పలకరించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ కి టాలీవుడ్ ఇండస్ట్రీ లో టాప్ దర్శకుల్లో ఒకరు అయినటు వంటి కొరటాల శివ దర్శకత్వం వహించగా ... మణిశర్మ ఈ మూవీ  కి సంగీతం అందించాడు. ఈ మూవీ లో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఒక కీలకమైన పాత్రలో నటించగా ... రామ్ చరణ్ కు జోడిగా ఈ మూవీ లో పూజా హెగ్డే నటించింది.  

ఈ మూవీ లో మెగాస్టార్ చిరంజీవి ... మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ లో కలిసిన నటించడం ... టాలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ దర్శకుల్లో ఒకరు అయినటు వంటి కొరటాల శివ ఈ మూవీ కి దర్శకత్వం వహించడంతో ఈ మూవీ పై ప్రేక్షకుల్లో భారీగా అంచనాలు పెరిగిపోయాయి. అన్న భారీ అంచనాలు నడుమ ప్రపంచ వ్యాప్తంగా విడుదల అయిన ఈ మూవీ విడుదల అయిన మొదటి రోజు మొదటి షో కే బాక్స్ ఆఫీస్ దగ్గర ఘోరమైన నెగిటివ్ టాక్ ను తెచ్చుకుంది.

దానితో ఈ మూవీ కి బాక్స్ ఆఫీస్ దగ్గర సరైన కలెక్షన్ లు కూడా లభించలేదు. అలా బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రేక్షకులను తీవ్ర నిరుత్సాహపరిచిన ఈ సినిమా కొంత కాలం క్రితమే బుల్లి తెరపై ప్రసారం అయింది. బుల్లి తెరపై మొదటి సారి ప్రసారం అయినప్పుడు ఈ సినిమాకు 6.30 "టి ఆర్ పి" రేటింగ్ దక్కింది. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ మూవీ రెండవ సారి బుల్లి తెరపై ప్రసారం అయింది. రెండవ సారి ఈ మూవీ కి 2.69 "టి ఆర్ పి" రేటింగ్ దక్కింది. మొదటి సారి తో పోలిస్తే రెండవ సారి ఈ మూవీ కి "టి ఆర్ పి" రేటింగ్ బాగా తగ్గిపోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: