"సలార్" ఇంగ్లీష్ వర్షన్ పై అదిరిపోయే న్యూస్ వచ్చేసింది..?

Pulgam Srinivas
రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుస మూవీ లకు కమిట్ అయిన విషయం మన అందరికీ తెలిసిందే. అందులో భాగంగా ఇప్పటికే ప్రభాస్ "ఆది పురుష్" మూవీ షూటింగ్ ను పూర్తి చేసుకున్నాడు. ప్రస్తుతం సలార్ ... ప్రాజెక్టు కే ... మారుతి దర్శకత్వంలో రూపొందుతున్న మూడు మూవీ ల షూటింగ్ లలో పాల్గొంటున్నాడు. ఇది ఇలా ఉంటే ఈ మూడు మూవీ ల షూటింగ్ లలో ముందుగా ప్రభాస్ "సలార్" మూవీ షూటింగ్ ను పూర్తి చేయనున్నాడు.

ఇప్పటికే సలార్ మూవీ కి సంబంధించిన షూటింగ్ చివరి దశకు చేరుకుంది. మరొక 15 నుండి 20 రోజుల్లో ఈ మూవీ షూటింగ్ మొత్తం పూర్తి కానున్నట్లు తెలుస్తోంది. ఆ తర్వాత ఈ మూవీ పోస్ట్ ప్రొడక్షన్ పనులను కూడా ఈ చిత్ర బృందం త్వరగానే మొదలు పెట్టబోతునట్లు తెలుస్తుంది. ఇది ఇలా ఉంటే ఈ మూవీ మొదలు పెట్టినప్పుడు ఈ సినిమాను తెలుగు , తమిళ , కన్నడ , మలయాళం , హిందీ భాషలలో విడుదల చేయనున్నట్లు ఈ మూవీ బృందం ప్రకటించింది.

 కాకపోతే ప్రభాస్ కు ఉన్న స్టామినాను బట్టి ఈ మూవీ ని ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయాలని ఈ చిత్ర బృందం ఆలోచనలో ఉన్నట్లు అందులో భాగంగా ఈ మూవీ ని ఇంగ్లీష్ భాషలో కూడా విడుదల చేయడానికి డిసైడ్ అయినట్లు తెలుస్తోంది. అందులో భాగంగా ఈ మూవీ యొక్క ఇంగ్లీష్ వర్షన్ లో పాటలు మరియు కామెడీ సీన్ లను తీసేసి డబ్బింగ్ చేయనున్నట్లు తెలుస్తోంది. అలాగే తెలుగు వర్షన్ కు మరియు ఇంగ్లీష్ వర్షన్ కు దాదాపు అరగంటకు పైగా నిడివి తేడా వచ్చే అవకాశాలు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ మూవీ కి ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించగా ... శృతి హాసన్ ఈ సినిమాలో ప్రభాస్ సరసన హీరోయిన్ గా నటిస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: