విజయ్ ... సమంత "ఖుషి" మూవీ విడుదల తేదీని ప్రకటించిన చిత్ర బృందం..!

Pulgam Srinivas
టాలీవుడ్ యువ హీరోలలో ఒకరు అయినటు వంటి విజయ్ దేవరకొండ ఆఖరుగా లైగర్ అనే మూవీ తో ప్రేక్షకులను పలకరించిన విషయం మన అందరికీ తెలిసిందే. భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా మూవీ గా రూపొందిన ఈ సినిమాకు డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వం వహించగా ... అనన్య పాండే ఈ మూవీ లో హీరోయిన్ గా నటించింది. భారీ అంచనాల నడుమ తెలుగు ,  తమిళ , కన్నడ , మలయాళం , హిందీ భాషలలో విడుదల అయిన ఈ మూవీ ప్రేక్షకులను ఏ మాత్రం అలరించ లేక పోయింది.
 

ఇలా లైగర్ లాంటి భారీ ఫెయిల్యూర్ తర్వాత విజయ్ ... శివ నర్వాన దర్శకత్వంలో రూపొందుతున్న ఖుషి అనే మూవీ లో హీరో గా నటిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ లో సమంత హీరోయిన్ గా నటిస్తోంది. ఈ మూవీ షూటింగ్ చాలా రోజుల క్రితమే ప్రారంభం అయింది. అలాగే ఇప్పటికే ఈ మూవీ కి సంబంధించిన చాలా భాగం షూటింగ్ కూడా పూర్తి అయింది. ఇది ఇలా అంటే తాజాగా ఈ మూవీ యూనిట్ ఈ సినిమాకు సంబంధించిన ఒక అదిరిపోయే అప్డేట్ ను ప్రకటించింది.

 తాజాగా ఈ మూవీ యూనిట్ ఈ సినిమా విడుదల తేదీని అధికారికంగా ప్రకటించింది. ఈ సినిమాను ప్రపంచ వ్యాప్తంగా 1 సెప్టెంబర్ 2023 వ తేదీన విడుదల చేయనున్నట్లు ఈ మూవీ యూనిట్ అధికారికంగా ప్రకటిస్తూ ఒక పోస్టర్ ను కూడా విడుదల చేసింది. ఈ మూవీ విడుదల తేదీని ప్రకటిస్తూ ఈ చిత్ర బృందం విడుదల చేసిన పోస్టర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఇది వరకే విజయ్ ... సమంత కలిసి మహానటి మూవీ లో నటించారు. ఇది వీరిద్దరి కాంబినేషన్ లో రెండవ సినిమా.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: