మహేష్ లేటెస్ట్ మూవీ షూటింగ్ అప్డేట్ న్యూస్..!

Pulgam Srinivas
సూపర్ స్టార్ మహేష్ ఇప్పటికే ఎన్నో బ్లాక్ బస్టర్ మూవీ లలో హీరో గా నటించి టాలీవుడ్ ఇండస్ట్రీ లో టాప్ హీరో లలో ఒకరిగా కొనసాగుతున్న విషయం మన అందరికీ తెలిసిందే. పోయిన సంవత్సరం కూడా మహేష్ ... పరశురామ్ దర్శకత్వంలో రూపొందిన సర్కారు వారి పాట అనే పక్కా కమర్షియల్ మూవీ తో అదిరిపోయే రేంజ్ బ్లాక్ బస్టర్ విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర సొంతం చేసుకున్నాడు. ఈ మూవీ లో కీర్తి సురేష్ హీరోయిన్ గా నటించింది.

 ఇది ఇలా ఉంటే ప్రస్తుతం మహేష్ ... మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో రూపొందుతున్న మూవీ లో హీరో గా నటిస్తున్నాడు. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ లో రూపొందుతున్న ఈ మూవీ కి తమన్ సంగీతం అందిస్తూ ఉండగా ... పూజా హెగ్డే ... శ్రీ లీల ఈ సినిమాలో హీరోయిన్ లుగా కనిపించబోతున్నారు. ఇది ఇలా ఉంటే ఈ మూవీ మహేష్ ... త్రివిక్రమ్ కాంబినేషన్ లో రూపొందుతున్న మూడవ మూవీ కావడంతో ఈ మూవీ పై ప్రేక్షకుల్లో భారీగా అంచనాలు నెలకొని ఉన్నాయి.

ఇప్పటికే ఈ మూవీ షూటింగ్ ప్రారంభం అయ్యే చాలా బాగం షూటింగ్ కూడా పూర్తి చేసుకుంది. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ మూవీ షూటింగ్ కు సంబంధించిన ఒక క్రేజీ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అసలు విషయం లోకి వెళితే ... రెండు రోజుల క్రితం ఈ మూవీ యొక్క షూటింగ్ ను సారథి స్టూడియోలో ఈ చిత్ర బృందం ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల రెండు రోజుల క్రితం సారధి స్టూడియోలో జరగవలసిన ఈ మూవీ షూటింగ్ క్యాన్సల్ అయినట్లు తెలుస్తుంది. ఈ మూవీ ని ఈ సంవత్సరం ఆగస్టు నెలలో విడుదల చేయనున్నట్లు ఈ మూవీ బృందం కొన్ని రోజుల క్రితం ప్రకటించింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: