"శాకుంతలం" మూవీలో "అప్సర మేనక" పాత్రలో ఆ నటి..!

Pulgam Srinivas
తెలుగు సినిమా ఇండస్ట్రీ లో దర్శకుడు గా తనకంటూ ఒక అద్భుతమైన క్రేజ్ ను సంపాదిం చుకున్న గుణ శేఖర్ గురించి ప్రత్యేకంగా టాలీవుడ్ సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. కెరియర్ ప్రారంభం లోనే చూడాలని ఉంది మూవీ తో మంచి విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర సొంతం చేసుకున్న ఈ దర్శకుడు ఆ తర్వాత ఒక్కడు లాంటి సన్షేషనల్ విజయ వంతమైన మూవీ తో తెలుగు సినిమా ఇండస్ట్రీ లో టాప్ దర్శకు ల్లో ఒకరిగా మారిపోయాడు .
 

ఇది ఇలా ఉంటే ఈ క్రేజీ దర్శకుడు ఆఖరుగా భారీ బడ్జెట్ తో రూపొందిన రుద్రమదేవి అనే సినిమాకు దర్శకత్వం వహించాడు. ఈ మూవీ మంచి విజయం అందుకుంది. అనుష్క ఈ మూవీ లో ప్రధాన పాత్ర లో నటించగా ... రానా ... అల్లు అర్జున్ ఈ మూవీ లో ఇతర ముఖ్య పాత్రలలో నటించారు . ఇది ఇలా ఉంటే తాజాగా ఈ క్రేజీ దర్శకుడు శాకుంతలం అనే భారీ బడ్జెట్ మూవీ కి దర్శకత్వం వహించాడు. ఈ మూవీ లో సమంత ప్రధాన పాత్రలో నటించింది.

ఈ మూవీ ని ఏప్రిల్ 14 వ తేదీన ప్రపంచవ్యాప్తంగా తెలుగు , తమిళ , కన్నడ , మలయాళ , హిందీ భాషలలో విడుదల చేయనున్నారు. ఇది ఇలా ఉంటే ఈ మూవీ విడుదల తేదీ దగ్గర పడడంతో తాజాగా ఈ మూవీ యూనిట్ ఈ సినిమా నుండి ఒక పోస్టర్ ను విడుదల చేసింది. ఈ పోస్టర్ లో మధు ఈ మూవీ లో అప్సర మేనక పాత్రలో కనిపించబోతున్నట్లు ఈ మూవీ యూనిట్ అధికారికంగా ప్రకటిస్తూ ఒక పోస్టర్ ను కూడా విడుదల చేసింది. ప్రస్తుతం ఈ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: