మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కెరియర్ లో ఇప్పటికి కూడా ప్రేక్షకుల నుండి అద్భుతమైన రెస్పాన్స్ లభిస్తున్న మూవీ లలో ఆరెంజ్ మూవీ ఒకటి. ఈ మూవీ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కెరియర్ లో మూడవ మూవీ గా రూపొందింది. మగధీర లాంటి బ్లాక్ బాస్టర్ సినిమా తర్వాత రామ్ చరణ్ నుండి వచ్చిన సినిమా కావడంతో ఈ మూవీ పై మెగా అభిమానులతో పాటు మామూలు సినీ ప్రేమికులు కూడా భారీ అంచనాలు పెట్టుకున్నారు.
అలా భారీ అంచనాల నడుమ విడుదల అయిన ఈ మూవీ విడుదల అయిన మొదటి రోజు మొదటి షో కే బాక్స్ ఆఫీస్ దగ్గర తీవ్రమైన నెగిటివ్ టాక్ ను తెచ్చుకుంది. దానితో ఈ మూవీ కి లాంగ్ రన్ లో కూడా పెద్దగా కలెక్షన్ లు లభించలేదు. అలా బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రేక్షకులను నిరుత్సాహపరిచిన ఈ సినిమా ఆ తర్వాత బుల్లి తెరపై మాత్రం ప్రేక్షకుల నుండి సూపర్ రెస్పాన్స్ ను తెచ్చుకుంది. అలాగే ఇప్పటికి కూడా ఈ మూవీ కి ఈ మూవీ లోని పాటలకు ఎంతో మంది ప్రేక్షకుల నుండి అదిరిపోయే రెస్పాన్స్ లభిస్తూ ఉంటుంది.
ఇది ఇలా ఉంటే ఈ క్రేజీ మూవీ కి బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వం వహించగా ... జెనీలియా ఈ సినిమాలో హీరోయిన్ గా నటించింది. కొనదెల నాగబాబు భారీ బడ్జెట్ తో నిర్మించిన ఈ మూవీ కి హారిస్ జయరాజ్ సంగీతం అందించాడు. ఈ మూవీ కి ఈ సంగీత దర్శకుడు అందించిన సంగీతం ఇప్పటికి కూడా ప్రేక్షకులను ఉర్రూతలూగిస్తోంది. ఇది ఇలా ఉంటే ఈ సంవత్సరం రామ్ చరణ్ పుట్టిన రోజు సందర్భంగా ఆరెంజ్ మూవీ ని మార్చి 25 , 26 తేదీలలో 4 కే వర్షన్ తో థియేటర్ లలో రీ రిలీజ్ చేయనున్నారు. అందులో భాగంగా ఈ మూవీ బుకింగ్ లను ఓపెన్ చేసినట్లు ఈ మూవీ బృందం తాజాగా అధికారికంగా ప్రకటించింది.