మృత్యువుతో పోరాడిన వాడికి కూడా ఆయనంటే వణుకు.. కొరటాల శివ..!

Divya
తెలుగు సినిమాలని రాంగోపాల్ వర్మకి ముందు ఆ తర్వాత అని సపరేట్ చేసి చెప్పవచ్చు. ఇంచుమించు ప్రస్తుతం ఇదే కాంపాక్ట్ ఇస్తున్నారు కొరటాల శివ కమర్షియల్ సినిమాలని కొరటాల శివకి ముందు ఆ తర్వాత అని వేరు చేసి చెప్పవచ్చు. ముఖ్యంగా ఎంత పెద్ద కమర్షియల్ చిత్రాలైనా సరే ఒక సోషల్ కాజ్ టచ్ చేస్తూ రైటింగ్ లో తనదైన మార్క్ చూపించిన ఒకే ఒక్క దర్శకుడు కొరటాల శివ మాత్రమే.. శ్రీమంతుడు, భరత్ అనే నేను, జనతా గ్యారేజ్ ఇలా ఎన్టీఆర్ తో మహేష్ బాబు తో సినిమాలు చేసి భారీ పాపులారిటీని దక్కించుకున్నాడు.
ఇకపోతే ఓటమెరుగని దర్శకుడుగా గుర్తింపు తెచ్చుకున్న ఈయనకు ఆచార్య సినిమా భారీ డిజాస్టర్ ను మిగిల్చింది. రామ్ చరణ్ స్పెషల్ రోల్ ప్లే చేసిన ఈ సినిమా డిజాస్టర్ గా మిగిలింది. సినిమా ఫ్లాప్ అవ్వడానికి కారణాలు ఏవైనా సరే కొరటాల శివ ఇమేజ్ మాత్రం డామేజ్ అయిందని చెప్పాలి. అయితే ఇప్పుడు మళ్లీ ఆయన తనను తాను ప్రూవ్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. అందుకు ఆయుధంగా ఎన్టీఆర్ ను వాడబోతున్నాడని తెలుస్తోంది. ఆచార్య సినిమా ఫ్లాప్ తర్వాత ఎన్టీఆర్ 30వ సినిమా లాంచ్ గ్రాండ్ గా జరిగింది.
ఈ ఈవెంట్ లో కొరటాల శివ మాట్లాడుతూ.. ఎన్టీఆర్ 30 సినిమా కథ భారతదేశ సముద్ర తీరంలోని ఒక ఫర్బిడెన్ ల్యాండ్ లో జరగబోతోంది ఆ నేలపైన జంతువుల కన్నా ఎక్కువగా రక్షకులాంటి మనుషులు కనిపిస్తారు.  ఎవరు ఎవరికి భయపడరు.. చావుకు కూడా భయపడని వాళ్ళు..ఒక్కడికి మాత్రమే భయపడతారు.. అది నా అన్న ఎన్టీఆర్ కి మాత్రమే భయపడతారు.. ఈ సినిమా చేయడం నా అదృష్టంగా భావిస్తున్నాను.. ప్రపంచంలోనే సరికొత్త కథతో మీ ముందుకు రాబోతున్నాను.. అంటూ కొరటాల శివ చెప్పుకొచ్చారు. మరి కొరటాల శివ మాటలు వింటుంటే కచ్చితంగా ఈ సినిమా భారీ బ్లాక్ బాస్టర్ విజయం అందుకుంటుందని చెప్పడంలో సందేహం లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: